సోషల్ మీడియాలో సెలబ్రెటీలు ఏం పోస్ట్ చేసిన అది వైరల్ అవుతుంటుంది. అందులోనూ క్రీడాకారుల పోస్టులకు అయితే ఇక చెప్పనక్కర్లేదు. లైకులు, కామెంట్స్, షేర్లతో అభిమానులు సోషల్ మీడియాను మోతెక్కిస్తుంటారు. తాజాగా భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియో సింధు ఒక ప్రశాంతమైన పార్క్ ప్రాంతంలో తీసినది. అందులో ఒక హిందీ పాట వినిపిస్తుండగా సింధు తన రాకెట్‌తో బ్లూ జీన్స్, బ్లాక్ షర్ట్, టోపీ ధరించి వస్తుంది.
అయితే ఆ వెంటనే సింధు తన రాకెట్‌ను గాల్లోకి లేపి ఒక వైపుగా తిప్పుతుంది. ఈ క్రమంలో రాకెట్ గాల్లో లేచి పక్కకు యధాస్థానానికి వచ్చే లోపే సింధు లుక్ మారిపోతుంది. రాకెట్ కాస్త ఓ మంచి లేడీస్ బ్యాగ్ అవుతుంది. ఆమె డ్రెస్ కూడా మారిపోతుంది, మంచి ఫ్యాషన్ డ్రెస్ అవుతుంది. అంతేకాకుండా అంతకుముందు ఉన్న షూస్ కూడా మారి మంచి చెప్పులు అవుతాయి. మారాక సింధు డ్రెస్‌తోపాటు బ్యాగ్ అంతా ఒకే కలర్ ఉండడం మనం గమనించవచ్చు.
అలాగే సింధు వెనుక ఉండే కొన్ని పచ్చని మొక్కలను కూడా చూడవచ్చు. అంతేకాకుండా షో కోసం ఏర్పాటు చేసిన చిన్నపాటి వాటర్ ఫాల్‌తో ఆ వాతావరణం ఆహ్లాదకరంగా కనిపిస్తుంది. దాని వెనుక పెద్ద రాళ్లు కూడా బ్యాక్‌గ్రౌండ్‌లో కనిపిస్తాయి. దీంతో అభిమానులు సింధు చేసిన ఇన్స్టాగ్రామ్ రీల్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. లైక్‌లు కొట్టి, కామెంట్లు చేసి, షేర్లు చేస్తూ తెగ వైరల్ చేస్తున్నారు. గతంలో కూడా సింధు ఇలాగే సోషల్ మీడియాలో తనకు సంబంధించిన పలు వీడియోలను పోస్ట్ చేసింది. దీంతో అభిమానులు లైక్‌లు, కామెంట్లు, షేర్లతో స్పందించారు.
అంతేకాకుండా ఆ వీడియోలను తెగ వైరల్ చేసేశారు. కాగా రెండు సార్లు ఒలింపిక్ పతక విజేత, వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ పివీ సింధు ప్రస్తుతం ఇండియా ఓపెన్‌లో ఆడుతుంది. వరుసగా రెండు రౌండ్లలో గెలిచి క్వార్టర్ ఫైనల్లో అడుగుపెట్టింది. 30 నిముషాల్లోనే ముగిసిన రెండో రౌండ్ మ్యాచ్‌లో సింధు 21-10, 21-10 తేడాతో గెలిచింది.
ఈ మధ్య క్రికెటర్లు కూడా తమదైన స్టైల్లో సోషల్‌మీడియాలో తమ టాలెంట్‌ను చూపిస్తున్నారు. ఇందులో టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా మొదటి వరుసలో ఉంటాడు. ఇటీవల తెలుగు నాట విడుదలైన పుష్ప సినిమాకు సంబంధించిన వరుస వీడియోలను చేస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటున్నాడు.