Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

PV Sindhu: ఉబెర్ క‌ప్‌ నుంచి వైదొలిగిన పీవీ సింధు!!

PV Sindhu Opts Out Of Thomas And Uber Cup due to Personal Reasons

హైదరాబాద్: డెన్మార్క్‌లో వచ్చే నెలలో ప్రారంభంకానున్న థామస్‌ అండ్‌ ఉబెర్‌ కప్‌ టోర్నీ నుంచి భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు వైదొలిగారు. ఈ విషయాన్ని సింధు తండ్రి పీవీ రమణ బుధ‌వారం మీడియాకు వెల్లడించారు. వ్యక్తిగత కారణాలతోనే సింధు ఈ టోర్నీకి దూరమ‌వుతున్న‌ద‌ని ఆయ‌న చెప్పారు. షెడ్యూల్ ప్ర‌కారం వచ్చేనెల 3 నుంచి 11 వరకు డెన్మార్క్‌లోని అర్హస్‌లో థామస్‌ అండ్‌ ఉబెర్‌ కప్‌ టోర్నీ జరగనుంది.

'పీవీ సింధు వ్యక్తిగత కారణాల వల్ల 2020 థామస్ అండ్‌ ఉబెర్ కప్‌లో పాల్గొనడం లేదు' అని పీవీ రమణ తెలిపారు. మరోవైపు డెన్మార్క్‌లో థామ‌స్ అండ్ ఉబెర్ క‌ప్ టోర్నీ నుంచి వైదొలగాల‌ని తాను నిర్ణ‌యించుకున్న‌ట్లు భారత స్టార్‌ షట్లర్ ‌సింధు బ్యాడ్మింట‌న్ అసోసియేష‌న్ ఆఫ్ ఇండియా (బీఏఐ)కు స‌మాచారం కూడా ఇచ్చార‌ని బీఏఐకి చెందిన సీనియ‌ర్ అధికారి ఒక‌రు తెలిపారు.

రాబోయే మ‌రో రెండు టోర్న‌మెంట్‌ల‌కు కూడా పీవీ సింధు త‌న ఎంట్రీల‌ను పంప‌నున్న‌ద‌ని, అయితే అప్ప‌టి ప‌రిస్థితుల‌ను బ‌ట్టి ఆ టోర్నీల్లో ఆడాలా, వ‌ద్దా అనే విష‌యాన్ని నిర్ణ‌యించుకోనున్న‌ద‌ని సింధు తండ్రి పీవీ రమణ పేర్కొన్నారు. అయితే డెన్మార్క్‌లోని ఓడెన్స్‌లో జ‌రుగనున్న బ్యాడ్మింట‌న్ వ‌ర‌ల్డ్ ఫెడ‌రేష‌న్ సూప‌ర్ 750 టూర్ ఇవెంట్ల‌లో సింధు పాల్గొంటార‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు.

హైదరాబాద్‌లోని పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీలో ఎనిమిది మంది ఒలింపిక్ క్రీడాకారుల కోసం ఆగస్టు 7న జాతీయ శిబిరం ప్రారంభించడంతో.. ప్రపంచ ఛాంపియన్ షట్లర్ పీవీ సింధు శిక్షణను ప్రారంభించారు. అప్పటినుంచి సింధు రోజు ప్రాక్టీస్ చేస్తున్నారు. గతేడాది ప్రతిష్ఠాత్మక ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో సింధు స్వర్ణ పతకాన్ని సగర్వంగా ముద్దాడిన విషయం తెలిసిందే.

Story first published: Wednesday, September 2, 2020, 16:23 [IST]
Other articles published on Sep 2, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+