రియో డీ జనీరో: రియో ఒలింపిక్స్‌లో వెండి లేదా స్వర్ణం పతకం ఖాయమైన నేపథ్యంలో తెలుగు తేజం పివి సింధుకు దేశ అత్యున్నత క్రీడా పురస్కారం రాజీవ్ ఖేల్ రత్న లభించడం ఖాయమైంది. బాడ్మింటన్ సింగిల్స్ సెమీ ఫైనల్‌లో జవరల్డ్ 10వ ర్యాంక్‌లో సిందు 21-19, 21-10తో ప్రపంచ 6వ ర్యాంకర్ నొజోమి ఒకుహారా (జపాన్)ను ఓడించి సింధు ఫైనల్ చేరి, పతకాన్ని ఖరారు చేసుకుంది.
శుక్రవారం జరిగే తుది పోరులోనూ విజయం సాధిస్తే భారత బ్యాడ్మింటన్‌లో సింధు అత్యున్నత స్థాయికి చేరుకుంది. ఈ మ్యాచ్‌లో ఓడినా, వెండి పతకంతో కొత్త చరిత్రను సృష్టించడం ఇప్పటికే ఖాయమైపోయింది. రియో ఒలింపిక్స్ బ్యాడ్మింటన్‌లో ఫైనల్‌కు చేరిన తొలి భారత షట్లర్‌గా సింధు చరిత్ర సృష్టించింది.
దీంతో కేంద్ర ప్రభుత్వం గతంలో తీసుకున్న నిర్ణయం ప్రకారం సింధుకి ఖేల్ రత్న అవార్డును లభిస్తుంది. ప్రపంచ క్రీడలుగా భావించే ఒలింపిక్స్ వంటి మెగా ఈవెంట్స్‌లో పతకం సాధించిన ప్రతి ఒక్కరికీ ఖేల్ రత్న అవార్డు ఇవ్వాలని కేంద్రం గతంలో నిర్ణయం తీసుకుంది. కాగా రియో ఒలింపిక్స్‌లో ఇప్పటికే కాంస్య పతకం సాధించిన సాక్షి మాలిక్‌కి కూడా ఖేల్ రత్న అవార్డు లభిస్తుంది.

మహిళల 56 కిలోల ఫ్రీస్టయిల్ రెజ్లింగ్‌లో కిర్గిస్థాన్‌కు చెందిన టొనిబెకొవాను ఓడించి సాక్షి మాలిక్ కాంస్య పతకాన్ని సాధించి సంగతి తెలిసిందే. కాగా, ఏస్ షూటర్ జీతూ రాయ్, తృటిలో కాంస్య పతకాన్ని చేజార్చుకున్న జిమ్నాస్ట్ దీపా కర్మాకర్ పేర్లు వినిపించినా, ఇప్పుడు సింధు పేరు ఖాయమైంది.
త్రిపురకు చెందిన జిమ్నాస్ట్ దీపా కర్మాకర్‌ను కూడా ఖేల్ రత్నతో సత్కరించాలని క్రీడాశాఖ వర్గాలు భావిస్తున్నాయి. రియో ఒలింపిక్స్‌లో జిమ్నాస్టిక్స్ అంశంలో దీపాకు కొద్దిలో కాంస్య పతకం చేజార్చుకుంది. ఆమె నాలుగో స్థానంలో నిలిచింది. దీపా కర్మాకర్‌తో పాటు షూటర్ జీతూరాయ్ కూడా ఖేల్ రత్న రేసులో ఉన్నాడు.
స్పాన్సర్ చేసేవాళ్లు ఎవరూ లేకపోయినా, సదుపాయాలు శూన్యమైనా తన పేదరికాన్ని సైతం తోసిరాజని నైపుణ్యాలను అద్భుతంగా ప్రదర్శించింది. ప్రధానంగా అత్యంత ప్రమాదకరమైన ప్రోదునోవా విభాగంలో ఆమె ప్రతిభ అద్భుతమని క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు.
2010లో కామన్‌వెల్త్ గేమ్స్ జరిగినప్పుడు జిమ్నోవా అనే సంస్థ ఆమెకు జిమ్నాస్టిక్స్ దుస్తులు ఇచ్చింది. గత మూడు నెలల క్రితం వరకు అవే దుస్తులను దీపా ఉపయోగించిందంటే ఆమె ఆర్థిక పరిస్థితి ఎలా ఉండేదో తెలుసుకోవచ్చు. అయితే.. ఏప్రిల్‌లో జరిగిన రియో టెస్ట్ ఈవెంట్‌లో ఆమె క్వాలిఫై కావడంతో ఒక్కసారిగా ఆమెకు ప్రపంచ వ్యాప్త గుర్తింపు లభించింది.