ప్రపంచ బ్యాడ్మింటన్ టోర్నీ: ముగిసిన తెలుగు వారి పోరు
హైదరాబాద్: ఇండోనేషియా రాజధాని జకార్తాలో జరుగుతున్న ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో భారత క్రీడాకారిణి, తెలుగు తేజం పీవీ సింధు పోరాటం ముగిసింది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ఓటమి పాలైంది.
8వ సీడ్ కొరియన్ షట్లర్ సుంగ్ చేతిలో 17-21, 21-19, 16-21 తేడాతో సింధు ఓటమి పాలైంది. తొలి సెట్ కోల్పోయిన సింధు ఆ తర్వాత పుంజుకుని రెండో సెట్ గెలిచింది. అయితే నిర్ణయాత్మక మూడో సెట్‌లో 16-21 తేడాతో వెనుకబడింది.
దీంతో ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ నుంచి నిష్క్రమించింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రీక్వార్టర్స్‌లో 21-17, 14-21, 21-17తో వరల్డ్ మూడో ర్యాంకర్ లీ జురుయ్ (చైనా)పై విజయం సాధించిన సంగతి తెలిసిందే.

గతంలో వరుసుగా రెండుసార్లు కాంస్య పతకాలు సాధించిన సింధు ఈసారి క్వార్టర్ ఫైనల్లోనే వెనుదిరగడంతో అభిమానులు నిరాశ చెందారు.
ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్‌లో గుత్తా జ్వాలా జోడీ ఓటమి
ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ లో జ్వాలా గుత్తా, అశ్విని పొన్నప్ప జోడి పోరాటం కూడా ముగిసింది. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో డబుల్స్‌లో జ్వాలా గుత్తా, అశ్విని పొన్నప్ప జోడి అన్ సీడెడ్ జపనీస్ క్రీడాకారిణుల చేతిలో 23-25, 14-21 తేడాతో ఓటిమి పాలయ్యారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications