Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

నెం.1కు వణుకు పుట్టించింది: మారిన్ వ్యూహంతో, సింధు ఓటమికి కారణాలివే!

రియో డీ జెనిరో: రియో ఒలింపిక్స్ 2016 బ్యాడ్మింటన్ సింగిల్స్ ఫైనల్లో పీవీ సింధు స్పెయిన్ క్రీడాకారిణి కరోలినా మారిన్‌తో పోరాడి ఓడింది. తొలి సెట్లో తొలుత వెనుకబడినా.. ఆ తర్వాత అద్భుతంగా పుంజుకొని ఆ సెట్ గెలుచుకుంది. కానీ అనంతరం రెండు సెట్లను కోల్పోయి.. రజితంతో సరిపెట్టుకుంది.

తొలి సెట్లు పుంజుకున్నా, ఆ తర్వాత రెండు సెట్లలో పుంజుకోలేకపోయిందని, కరోనా అద్భుతంగా ఆడిందని సింధు తండ్రి చెప్పారు. సింధు ఓటమికి పలు కారణాలు ఉన్నాయని అంటున్నారు. సింధు పదేపదే కోర్టు బయటకు వచ్చి షటిల్ కొట్టింది. ముఖ్యంగా ఈ మ్యాచ్‌ను వీక్షించిన వారు పలు కారణాలు చెబుతున్నారు.

Sindhu

సర్వీసుల విషయంలో సింధు ఇంకా మెరుగుపడాల్సి ఉందని అంటున్నారు. ప్రత్యర్థి కరోలినాతో పోలిస్తే సింధు మైదానంలో చురుగ్గా కదలలేదని అంటున్నారు. ఇది కూడా ఓటమికి ఓ కారణమని చెబుతున్నారు. మారన్ రెచ్చిపోతుంటే సింధు మైదానంలో కదలడానికి ఇబ్బంది పడిందని అంటున్నారు.

పీవీ సింధు తొలి సెట్‌ను గెలుచుకుంది. అదే సమయంలో మారోలిన్.. ఆ సెట్‌ను తాను ఎందుకు కోల్పోయానో తరిచి చూసుకుంది. పీవీ సింధు చురుగ్గా కదలలేకపోవడాన్ని గమనించిన మారిన్.. వ్యూహాత్మక షాట్లతో సింధును మైదానం మొత్తం తిప్పించిందని అంటున్నారు. సింధు సెకండ్ సెట్ ఓడిపోవడానికి ప్రధానంగా అదే కారణమంటున్నారు.

అదే సమయంలో వరల్డ్ నెంబర్ వన్ కరోలినా మారిన్‌కు పీవీ సింధు చుక్కలు చూ పించిందని, పోరు ఏకపక్షం కాకుండా చేసిందని ప్రశంసలు కురుస్తున్నాయి. తనను ఓడించడం అంత సులువు కాదని సింధు ప్రత్యర్థికి తొలి గేమ్‌తోనే చెప్పింది. అయితే, సింధు మైనస్‌లను కరోలినా క్యాష్ చేసుకుందని చెబుతున్నారు.

Story first published: Tuesday, November 14, 2017, 10:11 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+