For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చైనా ఓపెన్‌‌ టోర్నీ నుంచి పీవీ సింధు నిష్క్రమణ

PV Sindhu loses in China Open quarters to China’s Bingjiao

హైదరాబాద్: చైనా ఓపెన్ వరల్డ్‌ టూర్‌ సూపర్‌-750 టోర్నీలో భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు పోరాటం ముగిసింది. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో సింధు 17-21, 21-17, 15-21 తేడాతో హిబింజియో(చైనా) చేతిలో ఓటమి పాలైంది.

దీంతో చైనా ఓపెన్‌ నుంచి సింధు నిష్క్రమించింది. రియో ఒలంపిక్స్ రజత పతక విజేత అయిన పీవీ సింధు తొలి గేమ్‌లోనే 17-21 తేడాతో ఓటమి పాలైనప్పటికీ, రెండో గేమ్‌లో అనూహ్యాంగా పుంజుకుని 21-17తేడాతో విజయం సాధించి సమం చేసింది.

ఇక నిర్ణయాత్మక మూడో గేమ్‌లో మాత్రం సింధు మొదటి నుంచే తడబడింది. బింజియో వరుసగా మూడు సర్వీస్‌ పాయింట్లు సాధించి ఏకంగా 7-4తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. అప్పటి నుంచి మ్యాచ్‌పై పట్టు సాధిస్తూ వచ్చిన బింజియో 21-15తో మూడో గేమ్‌తో పాటు మ్యాచ్‌ను కైవసం చేసుకుంది.

బింజియో చేతిలో సింధుకు ఇది వరుసగా మూడో ఓటమి. ఈ ఏడాది జులైలో ఇండోనేషియా ఓపెన్, అక్టోబర్‌లో ఫ్రెంచ్ ఓపెన్ టోర్నీల్లో బింజియో చేతిలో పీవీ సింధు ఓడిపోయింది. అంతకుముందు వీరిద్దరి మధ్య జరిగిన రెండు మ్యాచ్‌లు రెండు గేమ్‌ల్లోనే ముగిస్తే ఈ మ్యాచ్‌ మాత్రం మూడో గేమ్‌ వరకూ వెళ్లడం విశేషం.

మూడో సీడ్ సింధు ఈ సీజన్‌లో మూడు పతకాలను గెలిచింది. కామన్వెల్త్ గేమ్స్, వరల్డ్ ఛాంపియన్‌పిప్, ఆసియా గేమ్స్‌లో సింధు కాంస్య పతకాలను నెగ్గిన సంగతి తెలిసిందే.

Story first published: Friday, November 9, 2018, 18:09 [IST]
Other articles published on Nov 9, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+