రెండో గేమ్‌లో సింధు ఓటమి: సెమీస్ ఆశలు క్లిష్టం
హైదరాబాద్: దుబాయిలో జరుగుతున్న వరల్డ్ సూపర్ సిరీస్ ఫైనల్స్ ఆరంభ మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన చేసిన భారత స్టార్ షట్లర్, రియో ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు రెండోమ్యాచ్‌లో తడబడింది. ప్రపంచ ఆరో ర్యాంకర్ సున్ యు (చైనా)తో గురువారం జరిగిన గ్రూప్ 'బి' రెండో లీగ్ మ్యాచ్‌లో సింధు 15-21, 17-21తో ఓటమి పాలైంది.
బుధవారం జరిగిన తొలి మ్యాచ్‌లో తనకంటే మెరుగైన ర్కాంకులో ఉన్న యమగుచి (జపాన్)ని చిత్తుచేసిన సింధు, చైనా స్టార్ ముందు మాత్రం తేలిపోయింది. 49 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సున్ యు ఆద్యంతం నిలకడగా ఆడి సింధుపై విజయం సాధించింది.
ఐతే ఎదురుదాడి.. దూకుడు వ్యూహాన్ని ఎంచుకున్నా సింధు ఫలితం రాబట్టలేకపోయింది. దానికితోడు అనవసర తప్పిదాలతో మూల్యం చెల్లించుకుంది. తొలి పాయింట్ నుంచే ఆధిక్యంలోకి వెళ్లిన సున్ చివరి వరకు అదే జోరు కొనసాగించింది. తొలి గేమ్‌లో ఇద్దరి స్కోర్లు ఒక్కసారి కూడా సమం కాలేదు.

6 పాయింట్లు రాబట్టిన సింధు
ఒకానొక దశలో 9-20తో ఉన్నారు. ఈ క్రమంలో సింధు వరుసగా 6 పాయింట్లు రాబట్టింది. దీంతో 15-21తో తొలి గేమ్‌ను కోల్పోయింది. ఇక రెండో గేమ్‌లో సింధు తేరుకొని 15-13తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఈ దశలో సున్ యు దూకుడుగా ఆడి వరుసగా నాలుగు పాయింట్లు గెలిచి 17-15తో ముందంజ వేసింది.

ఔట్‌షాట్లతో సింధు అనవసర తప్పిదాలు
రెండో గేమ్‌లో ఔట్‌షాట్లతో అనేకసార్లు తప్పిదాలకు పాల్పడిన సింధు ఆ తర్వాత గేమ్‌పై ఏకాగ్రత కోల్పోయి మ్యాచ్‌ను చేజార్చుకుంది. ఈ ఓటమితో సింధు సెమీఫైనల్ అవకాశాలను క్లిష్టం చేసుకుంది. ఇక తన గ్రూప్ లీగ్ దశలో ఆఖరిదైన మూడోమ్యాచ్‌లో సింధు మాజీ ప్రపంచ నంబర్‌వన్ కరోలినా మారిన్‌తో శుక్రవారం తలపడనుంది.

కరోలినా మారిన్‌తో సింధు
ప్రపంచ రెండోర్యాంకర్ అయిన స్పెయిన్ స్టార్ కరోలినా ఈ ఏడాది రియో ఒలింపిక్స్ ఫైనల్లో సింధును ఓడించి విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. మారిన్‌తో ముఖాముఖి రికార్డులో సింధు 2-5తో వెనుకంజలో ఉంది. ఇక మరో మ్యాచ్‌లో జపాన్ స్టార్ యమగుచి 18-21, 21-17, 21-14తో మారిన్‌ను చిత్తుచేసింది.

కీలకంగా మారిన నేటి మ్యాచ్
గ్రూప్-బిలో వరుసగా రెండో మ్యాచ్‌లోనూ విజయం సాధించిన సన్ యూ దాదాపుగా సెమీఫైనల్‌కు చేరినట్లే. ఇక ఈ గ్రూప్ నుంచి రెండో సెమీస్ బెర్త్ కోసం కరోలినా మారిన్, యమగుచి, సింధుల మధ్య పోటీ నెలకొంది. ఈ ముగ్గురిలో సింధు, యమగుచి తామాడిన రెండుమ్యాచుల్లో ఒక్కో విజయం సాధించి సమంగా ఉన్నారు. ఇక మారిన్ మాత్రం రెండుమ్యాచుల్లో ఓటమిపాలైంది. దీంతో శుక్రవారం జరిగే మ్యాచ్ సింధుకు ఎంతో కీలకంగా మారింది. సింధు మ్యాచ్‌ని టీమిండియా దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ ప్రత్యక్షంగా వీక్షించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications