Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఇంటర్నెట్‌లో వైరల్‌లా పీవీ సింధు ఫొటోషూట్ ఫోటోలు

హైదరాబాద్: ఫ్యాషన్, ఆటలు కలిసి కొనసాగవని ఒకానొక సమయంలో ప్రజలు నమ్మేవారు. అయితే ఇది గతం. అయితే సానియా మిర్జా నుంచి విరాట్ కోహ్లీ క్రీడల్లోకి ఎంటరైన తర్వాత ఈ వాదనను పూర్తిగా మార్చేశారు. ఆటలతో పాటు ఫ్యాషన్ ఐకాన్లుగా రాణిస్తున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

తాజాగా రియో ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించిన పీవీ సింధు కూడా ఇందుకు తానేమీ తక్కువ కాదన్నట్లుగా ఓ ఫోటో షూట్ చేసింది. అతి చిన్న వయసులోనే భారతదేశం గర్వించదగ్గ విజయాలను పీవీ సింధు సొంతం చేసుకుంది.

అందంతో పాటు ఆట పట్ల ఆమెకున్న అంకిత భావం అపారం. అదే ఆమెను బ్యాట్మింటన్ ఆటలో అగ్రస్ధానంలో నిలబెట్టింది. ఆటతో పాటు అందం ఉండటమే సానియా మిర్జా, సైనా నెహ్వాల్, పీవీ సింధు లాంటి వారిని అడ్వర్‌టైజింగ్ రంగంలో మహారాణులుగా నిలిచేలా చేసింది.

PV Sindhu looks absolutley gorgeous in this photoshoot for a magazine

నిజానికి ఈ రంగంలో ఒకప్పుడు సానియా మిర్జా, సైనా నెహ్వాల్ పేర్లు బాగా వినిపించేవి. కానీ ఇప్పుడు వారితో పాటు పీవీ సింధు పేరు కూడా వినిపిస్తుంది. అందుకు కారణం ఇటీవల జరిగిన రియో ఒలింపిక్స్‌లో ఆమె రజత పతకాన్ని గెలుచుకోవడమే.

ఒక్కమాటలో చెప్పాలంటే రియోలో ఆమె పతకం గెలిచిన తర్వాత ఆమె బ్రాండ్ వాల్యూ అమాంతం పెరిగింది. ప్రస్తుతం ఆమె బ్రాండ్ వాల్యూ రూ. 50 కోట్లకు పైగానే ఉందని అంటున్నారు. రియో ఒలింపిక్స్‌లో సింధు పతకం సాధించిన తర్వాత ఆమెతో పలు బడా కార్పోరేట్ సంస్ధలు ఒప్పందాలు చేసుకున్నాయి.

తాజాగా ''జస్ట్ ఫర్ వుమెన్'' అనే మహిళల మ్యాగజైన్ కోసం సింధుపై ఒక ఫొటోషూట్ చేశారు. అందులో ఆమె మోడల్స్‌కు ఏ మాత్రం తగ్గకుండా ఫోజులిచ్చి అందర్నీ ఆశ్చర్చపరిచింది. ఇప్పుడు ఆ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ లాగా మారాయి.

Story first published: Tuesday, November 14, 2017, 10:11 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+