హైదరాబాద్: రియో ఒలింపిక్స్ పైనల్స్‌లో అద్భుతమైన పోరాట ప్రతిభను చూపి 120 కోట్ల భారతీయలు హృదయాలను గెలుచుకున్న తెలుగు తేజం పీవీ సింధు ఒక్కసారిగా స్టర్ ప్లేయర్‌గామారిపోయింది. ఒలింపిక్స్‌లో రజతం సాధించిసాధించిన తొలి భారతీయ మహిళగా చరిత్ర సృష్టించింది.
120 ఏళ్ల ఒలింపిక్ చరిత్రలోనే దేశానికి తొలి బ్యాడ్మింటన్ రజతాన్ని అందించిన 21 ఏళ్లు సింధు పేరు ప్రఖ్యాతలు దేశవ్యాప్తంగా మారుమోగుతున్నాయి. ఈ నేపథ్యంలో సింధుకు నగదు రివార్డులతోపాటు, ప్రముఖ కంపెనీల నుంచి ఆకర్షణీయమైన ఉద్యోగ ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. సింధు అందుకోనున్న నగదు రివార్డులు ఇవే
తెలంగాణ ప్రభుత్వం రూ. కోటి నజరానా!
ఒలింపిక్స్‌లో అద్భుతమైన ప్రదర్శనను కనబర్చి రజత పతకం సాధించిన పీవీ సింధుకు తెలంగాణ ప్రభుత్వం నుంచి రూ. కోటిని గిప్ట్‌గా ఇవ్వనుంది. ఈ మేరకు శనివారం జరగే మంత్రివర్గ సమావేశంలో సీఎం కేసీఆర్ ఓ నిర్ణయం తీసుకోనున్నారు. ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించిన రాష్ట్ర క్రీడాకారులకు రూ. కోటి పారితోషకం ఇస్తామని టీ ప్రభుత్వం తన క్రీడా విధానంలో ప్రకటించింది.

సచిన్ చేతుల మీదగా సింధుకు 60 లక్షల బీఎండబ్ల్యూ కారు
ఫైనల్స్‌కు సింధు చేరిన వెంటనే అక్కడే ఉన్న హైదరాబాద్ డిస్ట్రిక్ట్ బాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడు, ఇండియన్ బ్యాడ్మింటన్ లీగ్‌లో ముంబై మాస్టర్స్ ఫ్రాంచైజీ సహ యజమానిగా వ్యవహరిస్తున్న చాముండేశ్వరీనాథ్ ఆమెకు ఖరీదైన గిప్ట్‌ను ప్రకటించారు. తెలుగు రాష్ట్రాల నుంచి రియో ఒలింపిక్స్‌లో ప్రాతినిధ్యం వహిస్తున్న క్రీడాకారులు ఎవరైనా సరే పతకం సాధిస్తే వారికి బహుమతిగా బీఎండబ్ల్యు కారుని ఇస్తానని ఆయన గతంలోనే ప్రకటించారు. తాను చెప్పిన మాటకు కట్టుబడి రియోలో భారత్‌కు మరో పతకాన్ని ఖరారు చేసిన సింధుకు రూ.60 లక్షల విలువ చేసే బీఎండబ్ల్యూ కారును బహుమతిగా ఇవ్వనున్నారు.
సింధూకు ఢిల్లీ ప్రభుత్వం రూ.2 కోట్లు
రియో ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన క్రీడాకారిణిలకు ఢిల్లీ ప్రభుత్వం నగదు ప్రోత్సాహకాన్ని ప్రకటించింది. రజత పతకం సాధించిన తెలుగుతేజం సింధుకు రూ.2 కోట్లు, కాంస్యం సాధించిన హర్యానా అమ్మాయి సాక్షి మాలిక్‌కు కోటి రూపాయల ఇవ్వనున్నట్లు ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించింది.
సింధుకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం అరకోటి
రియో ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించిన సింధుకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం 50 లక్షల రివార్డు ప్రకటించింది. ఆమె దేశానికి గర్వకారణమని మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ ప్రశంసించారు.
ఏఐఎఫ్‌ఎఫ్ రూ. 5 లక్షల రివార్డు
అఖిలభారత ఫుట్‌బాల్ సమాఖ్య (ఏఐఎఫ్‌ఎఫ్) సింధు విజయాన్ని కొనియాడుతూ రూ.5 లక్షల రివార్డు ప్రకటించింది.
సింధుకు 'బాయ్' రూ.50 లక్షలు
తెలుగు తేజం సింధుకు బ్యాడ్మింటన్ అసోసియేషన్ (బీఏఐ) రూ.50 లక్షల నగదు బహుమతి ప్రకటించింది. సింధును తీర్చిదిద్దిన కోచ్ గోపీచంద్‌ను కూడా ప్రశంసలతో ముంచెత్తుతూ రూ.10 లక్షలు బహుమతి ఇవ్వనున్నట్లు బాయ్ ప్రెసిడెంట్ అఖిలేశ్‌దాస్ గుప్తా పేర్కొన్నారు. గోపీలాంటి మెంటార్, కోచ్ దేశానికి లభించడం క్రీడాకారుల అదృష్టమన్నారు.
జ్యూయలరీ షోరూంకు బ్రాండ్ అంబాసిడర్‌గా
విజయవాడకు చెందిన ఓ టాప్ జ్యూయలరీ షోరూంకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండాలంటూ సింధుని సంప్రదించిన సంస్ధ యాజమాని
సింధుకు ప్లాట్లు
హైదరాబాద్‌లోని పలు ఐటీ కారిడార్ కు చెందిన పలు రియల్ ఎస్టేట్ సంస్ధలు సింధుకు ప్లాట్లు ఇవ్వనున్నారు.
మహీంద్రా ఎస్‌యూవీ
ప్రముఖ కార్ల సంస్ధ మహీంద్రా & మహీంద్రా తనకు చెందిన ఫేమస్ ఎస్‌యూవీని సింధుకు ఇవ్వనుంది.