ఇండోనేసియా మాస్టర్స్: ప్రీ క్వార్టర్స్‌కు సైనా, సింధు, శ్రీకాంత్

హైదరాబాద్: భారత స్టార్ షట్లర్లు సైనా నెహ్వాల్, పీవీ సింధు, కిదాంబి శ్రీకాంత్ ఇండోనేసియా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో శుభారంభం చేశారు. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్‌లో ప్రపంచ మూడో ర్యాంకర్ సింధు 22-24, 21-8, 21-17తో ప్రపంచ మాజీ నంబర్‌వన్, 2012 లండన్ ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత లీ జురుయ్ (చైనా) పోరాడి గెలిచింది.

54 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో
54 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సింధు తొలి గేమ్‌ను చేజార్చుకున్నా... ఆ తర్వాత పుంజుకొని వరుసగా రెండు గేమ్‌లను సొంతం చేసుకుంది. మహిళల సింగిల్స్ తొలిరౌండ్లో ఎనిమిదో సీడ్ సైనా 7-21, 21-16, 21-11తో స్థానిక షట్లర్ దినార్ ద్యా ఆస్టిన్‌పై గెలుపొంది రెండో రౌండ్లోకి ప్రవేశించింది. గురువారం జరిగే ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో గ్రెగోరియా మరిస్కా (ఇండోనేసియా)తో సింధు, ఫిత్రియాని (ఇండోనేసియా)తో సైనా తలపడనున్నారు.

కిదాంబి శ్రీకాంత్ సునాయాస విజయం
ఇక, పురుషుల సింగిల్స్‌లో కిదాంబి శ్రీకాంత్ మాత్రం 21-12, 21-8తో చాంగ్ వి ఫెంగ్ (మలేసియా)పై సునాయాసంగా విజయం సాధించాడు. మిగతా భారత షట్లర్లలో సాయి ప్రణీత్ 12-21, 16-21తో ఒలింపిక్ విజేత చెన్ లోంగ్ (రష్యా) చేతిలో, పారుపల్లి కశ్యప్ 12-21, 16-21తో అంథోని సిన్సుకా (ఇండోనేసియా), శుభంకర్ 14-21, 21-19, 15-21తో విక్టర్ అక్సెలెసన్ (డెన్మార్క్) చేతిలో ఓడిపోయారు.

డబుల్స్‌లో ఆత్రి- సుమీత్ రెడ్డి జోడీ విజయం
పురుషుల డబుల్స్‌లో మాత్రం మను ఆత్రి- సుమీత్ రెడ్డి జోడీ 14-21, 21-19, 21-15తో మేడ్స్ పీలర్, నికొలస్ నోర్ (డెన్మార్క్) జోడీపై విజయం సాధించింది. మహిళల డబుల్స్‌లో సిక్కిరెడ్డి-అశ్విని పొన్నప్ప జోడీకి నిరాశే ఎదురైంది. సిక్కిరెడ్డి-అశ్విని పొన్నప్ప 14-21, 14-21తో థాయ్‌లాండ్ జంట కితిహరకుల్-ప్రజోన్‌జోయ్ చేతిలో చిత్తయింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications