Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

చైనా ఓపెన్ క్వార్టర్స్‌కు చేరిన సింధు, శ్రీకాంత్

PV Sindhu, Kidambi Srikanth In Quarter-Finals Of China Open

హైదరాబాద్: భారత స్టార్‌ షట్లర్లు పీవీ సింధు, కిదాంబి శ్రీకాంత్‌ చైనా ఓపెన్‌ బీడబ్ల్యూఎఫ్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌-750 టోర్నీలో క్వార్టర్‌ ఫైనల్లోకి దూసుకెళ్లారు. ఇటీవలి కాలంలో టైటిల్ సాధనలో విఫలమౌతున్న సింధు చైనా ఓపెన్ లక్ష్యంగా మరో అడుగు ముందుకేసింది. గురువారం జరిగిన ప్రి క్వార్టర్‌ఫైనల్లో మహిళల సింగిల్స్‌ ప్రిక్వార్టర్స్‌లో ప్రపంచ మూడో ర్యాంకర్‌ సింధు 21-12, 21-15తో అన్‌సీడెడ్‌ ఒంగ్‌బామ్‌రంగ్‌ఫన్‌ (థాయ్‌లాండ్‌)పై నెగ్గింది.

 కొన్నాళ్లుగా టైటిల్ పోరులో చతికిలపడ్డ సింధు

కొన్నాళ్లుగా టైటిల్ పోరులో చతికిలపడ్డ సింధు

2016 ఏడాదికిగాను చైనా ఓపెన్ గెలిచి సంచలనం సృష్టించిన సింధు కొన్నాళ్లుగా టైటిల్ పోరులో చతికిలపడుతుంది. దీంతో ఈ టోర్నీలో విజయంతో ఛాంపియన్‌గా నిలవాలనే కుతూహలంతో కనిపిస్తోంది. క్వార్టర్స్‌లో చైనాకు చెందిన ఎనిమిదో సీడ్ హి బింగ్జియావోను ఢీకొట్టనుంది. గతంలో రెండుసార్లు బింగ్జియావోతో తలపడినా సింధు ఒక్కసారి కూడా విజయం సాధించలేకపోయింది.

విరామానికి 11-8తో ఆధిక్యం చాటి

విరామానికి 11-8తో ఆధిక్యం చాటి

బుసానన్‌తో జరిగిన తొలిగేమ్‌లో ఆదినుంచే సింధు జోరుగా ఆడింది. విరామ సమయానికే 11-4 స్కోరుతో ఆధిక్యంలోకి దూసుకెళ్లిన సింధు 21-12 తేడాతో అలవోకగా తొలిగేమ్ సొంతం చేసుకుంది. ఇక రెండోగేమ్‌లోనూ సింధు 4-0తో ఆధిక్యం అందకున్నా.. వరుసగా ఏడు పాయింట్లు సాధించిన బుసానన్ 7-4తో ఆధిక్యంలో కి దూసుకెళ్లింది. అంతేకాదు విరామానికి 11-8తో ఆధిక్యం చాటిన సింధు..21-15 స్కోరుతో రెండోగేమ్‌తోపాటు మ్యాచ్ సొంతం చేసుకుంది.

 అద్భుతమైన ఫామ్‌తో దూసుకెళ్తున్న కిదాంబి శ్రీకాంత్‌

అద్భుతమైన ఫామ్‌తో దూసుకెళ్తున్న కిదాంబి శ్రీకాంత్‌

పురుషుల సింగిల్స్‌లో కిదాంబి శ్రీకాంత్‌ కూడా అద్భుతమైన ఫాంతో దూసుకెళుతున్నాడు. రెండోరౌండ్‌లో టామీ సుగియార్తోతో జరిగిన మ్యాచ్‌లో తొలిగేమ్‌లో 10-21 తేడాతో ఓడినా మళ్లీ శ్రీకాంత్ పుంజుకున్నాడు. రెండో గేమ్‌లో విజయంతో మ్యాచ్‌లో ఆసక్తిని పెంచిఏన శ్రీకాంత్..మూడోగేమ్‌నూ సునాయాసంగా గెలిచి టోర్నీలో క్వార్టర్స్ చేరాడు. 2014 ఏడాదిలో చైనా ఓపెన్ గెలుచుకున్న శ్రీకాంత్ మరోసారి టైటిల్ విజేతగా నిలవాలని ఆశిస్తున్నాడు. క్వార్టర్ ఫైనల్లో చైనీస్ తైపీకి చెందిన చై టియాన్ చెన్‌తో తలపడనున్నాడు.

క్వార్టర్స్‌కు చేరిన సాత్విక్‌ సాయిరాజ్‌-చిరాగ్‌ శెట్టి

క్వార్టర్స్‌కు చేరిన సాత్విక్‌ సాయిరాజ్‌-చిరాగ్‌ శెట్టి

పురుషుల డబుల్స్‌లో సాత్విక్‌ సాయిరాజ్‌-చిరాగ్‌ శెట్టి జంట 16-21, 21-14, 21-15తో వాహ్యూ నాయకా ఆర్య-యూసుఫ్‌ సంతోసో (ఇండోనేసియా) జోడీపై గెలిచి క్వార్టర్స్‌కు చేరింది. మహిళల డబుల్స్‌లో సిక్కిరెడ్డి-అశ్విని పొన్నప్ప జంట 19-21, 21-15, 17-21తో షిహో తనాకా-కొహరు యోనెమోటో (జపాన్‌) జోడీ చేతిలో ఓడింది.

Story first published: Friday, November 9, 2018, 11:17 [IST]
Other articles published on Nov 9, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+