ఆ విజయం నా జీవితంలో ఎంతో మార్పు: పీవీ సింధు
హైదరాబాద్: రియో ఒలింపిక్స్ విజయం తన జీవితంలో ఎంతో మార్పుని తీసుకొచ్చిందని భారత స్టార్ షట్లర్ పీవీ సింధు తెలిపింది. రియో ఒలింపిక్స్‌లో పతక విజయమిచ్చిన ఆత్మవిశ్వాసంతో రాబోయే డెన్మార్క్ టోర్నీలో ఎలాంటి ఒత్తిడిని దగ్గరకు రానివ్వకుండా రాణిస్తానని చెప్పింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
శుక్రవారం ముంబైలో శ్రీశ్రీ ఆయుర్వేద సంస్ధకు చెందిన ఉత్పత్తులు కార్యక్రమంలో జాతీయ బ్యాడ్మింటన్ ఛీప్ కోచ్ పుల్లెల గోపీచంద్‌తో కలిసి పీవీ సింధు పాల్గొంది. ఈ సందర్భంగా సింధు మీడియాతో మాట్లాడింది. రియోలో పతకం సాధించిన తర్వాత తన కెరీర్ పూర్తిగా మారిపోయిందని పేర్కొంది.

ఒలింపిక్స్ తర్వాత తన జీవితం చాలా మారిపోయిందని, రియోలో రజతం సాధించినందుకు ఎంతో ఆనందంగా ఉందని సింధు పేర్కొంది. ఇప్పటికే సాధన మొదలుపెట్టా. డెన్మార్క్, ఫ్రెంచ్ ఓపెన్ టోర్నీల కోసం ఇప్పటికే ప్రాక్టీస్‌లో నిమగ్నమయ్యానని తెలిపింది.
ఈ రెండు టోర్నీల్లో తన అత్యుత్తమ ఆటతీరు కనబరుస్తానని అభిప్రాయపడింది. రియో ఒలింపిక్స్ పతకం తనలో ఆత్మవిశ్వాసం నింపిందని వెల్లడించింది. భవిష్యత్తులోనూ అదే ఆత్మవిశ్వాసంతో ఆడతానని, ప్రస్తుతం అందరి దృష్టి నాపైనే ఉంటుందని తెలుసని చెప్పింది.
ఒత్తిడికి గురికాకుండా ఎప్పట్లాగే ఆటను ఆడేందుకు ప్రాముఖ్యతమిస్తానని సింధు తెలిపింది. రియో ఒలింపిక్స్ అనంతరం బరిలోకి దిగుతున్న తొలి టోర్నీ కావడంతో తనపై అంచనాలు భారీగానే ఉంటాయని వెల్లడించింది. రియో ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించిన తర్వాత దేశవ్యాప్తంగా సింధుని పలువురు సన్మానించిన సంగతి తెలిసిందే.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications