For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పీవీ సింధు రిటైర్ కాబోతోందా.. ఆ ట్వీట్ కథేంటి..?

PV Sindhu gives a mini heart stroke to her fans, says she chose to retire

న్యూఢిల్లీ: భారత బ్యాడ్మింటన్ స్టార్, తెలుగమ్మాయి పీవీ సింధు తన అభిమానులపై బాంబు వేశారు. కరోనా పరిస్థితుల వల్ల సామర్థ్యానికి తగ్గట్టుగా ఆడలేకపోతున్నానని వెల్లడించారు. కరోనా తీవ్రత తగ్గేంత వరకూ తాను ఎలాంటి టోర్నమెంట్లలో ఆడదలచుకోలేదని తెలిపారు. ఈ నెల 13వ తేదీన ఆరంభం కాబోయే డెన్మార్క్ ఓపెన్ తన చివరి టోర్నీ అవుతుందని స్పష్టం చేశారు.

పరిస్థితులు మెరుగు పడేంత వరకూ తాను బ్యాడ్యింటన్ ఆడబోనని చెప్పుకొచ్చారు. ఊహించని పరిస్థితుల్లో ఊహించని నిర్ణయాన్ని తీసుకోవాల్సి వచ్చిందని చెప్పారు. కరోనా పరిస్థితులు మెరుగుపడేంత వరకూ ఆమె బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

PV Sindhu gives a mini heart stroke to her fans, says she chose to retire

ఈ విషయాన్ని ఆమె ట్విట్టర్ ద్వారా స్పష్టం చేశారు. కనిపించని ఈ మహమ్మారి నియంత్రణలోకి వచ్చేంత వరకూ ఇకపై టోర్నమెంట్లకు దూరంగా ఉంటానని ఆమె చెప్పకనే చెప్పారు. కరోనా వైరస్ వ్యాక్తి చెందిన అనంతరం నెలకొన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని మాత్రమే తాను తాత్కాలికంగా దూరం అవుతున్నట్లు వెల్లడించారు.

షెడ్యూల్ ప్రకారం.. ఈ నెల 13వ తేదీన డెన్మార్క్ షెడ్యూల్ ప్రారంభం కానుంది. ఒలింపిక్స్‌లో రజత పతకాన్ని సాధించిన తొలి భారతీయ బ్యాడ్మింటన్ స్టార్‌గా ఆమె పేరు తెచ్చుకున్నారు. ఆమెను ఏపీ ప్రభుత్వం డిప్యూటీ కలెక్టర్‌గా నియమించింది. కరోనా వైరస్ అనంతరం బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ఆడే పరిస్థితులను కల్పించలేకపోవడానికి నిరసనగా ఆమె టోర్నమెంట్లకు దూరం అవుతున్నారనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.

Story first published: Monday, November 2, 2020, 16:04 [IST]
Other articles published on Nov 2, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+