టోక్యోలో స్వర్ణం నెగ్గి మీ ముందుంటాను: రాజ్‌భవన్ సన్మాన కార్యక్రమంలో సింధు

హైదరాబాద్: వరల్డ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం గెలిచి చరిత్ర సృష్టించిన పీవీ సింధుని తెలంగాణ గవర్నర్ నరసింహాన్ ఘనంగా సన్మానించారు. రాజ్ భవన్‌లోని దర్బార్ హాల్‌లో పీవీ సింధుని గవర్నర్ దంపతులు సన్మానించారు. అనంతరం పారా షట్లర్ మానసి జోషిని కూడా గవర్నర్ దంపతులు సన్మానించారు.
ఈ సందర్భంగా పీవీ సింధు మాట్లాడుతూ "ఇక్కడ ఉండటం చాలా సంతోషంగా ఉంది. గతంలో ఇదే రోజున మీరు చెప్పినట్లే నేను వరల్డ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ గెలిచాను. అందుకే ఈరోజు ఇక్కడ ఉన్నాను. ఈ మాటను గుర్తుపెట్టుకోండి 2020లో టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణం నెగ్గి మళ్లీ ఇక్కడ మీ ముందుంటాను" అని చెప్పగానే గవర్నర్ దంపతులు చప్పట్లతో స్వాగతించారు.

36 ఏళ్ల నిరీక్షణకు తెరదించిన పీవీ సింధు
ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్, కోచ్ పుల్లెల గోపీచంద్, పీవీ సింధు కుటుంబసభ్యులు, పలువురు క్రీడా ప్రముఖులు పాల్గొన్నారు. 36 ఏళ్ల నిరీక్షణకు పీవీ సింధు తెరదించడంతో పాటు వరల్డ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం నెగ్గిన తొలి మహిళ బ్యాడ్మింటన్ ప్లేయర్‌గా చరిత్ర సృష్టించింది.

సింధు విజయాన్ని ఆస్వాదిస్తూ
ఇలా యావత్ భారతావని సింధు విజయాన్ని ఆస్వాదిస్తూ తన్మయత్వంతో మునిగిపోయిన అదే ఆదివారం... అదే వేదికగా జరిగిన పారా బ్యాడ్మింటన్ టోర్నీలో మరో భారత అథ్లెట్ స్వర్ణం సాధించింది. తన పేరు మానసి జోషి. మహిళల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ నెంబర్ వన్ పారుల్ పామర్‌ను మట్టికరిపించి తొలిసారి పారా వరల్డ్ బ్యాడ్మింటన్ చాంపియన్ టైటిల్‌ను సొంతం చేసుకుంది.

మానసి జోషికి సైతం సన్మానం
దీంతో ఆమెను గుర్తించి తెలంగాణ గవర్నర్ నరసింహన్ సింధుతో సమానంతో ఆమెను కూడా సత్కరించారు. పారా బ్యాడ్మింటన్ టోర్నీలో పాల్గొన్న భారత అథ్లెట్లు మొత్తం 12 పతకాలను సాధించారు. ముంబైకు చెందిన మానసి జోషి కూడా హైదరాబాద్‌లోని గోపీచంద్ అకాడమీలోనే శిక్షణ తీసుకుంది. పీవీ సింధు మాదిరే పారా బ్యాడ్మింటన్ అథ్లెట్లకు కూడా ఘన స్వాగతం లభించింది.

రూ.20 లక్షల నగదు బహుమానం
అనంతరం పతకాలు నెగ్గిన షట్లర్లు కేంద్ర క్రీడాశాఖ మంత్రి కిరణ్ రిజుజుని కలిశారు. ఈ క్రమంలో పురుషుల సింగిల్స్ విభాగంలో స్వర్ణం సాధించి ప్రమోద్ భగత్‌కు, మహిళల సింగిల్స్ విభాగంలో స్వర్ణం సాధించి మానసి జోషిలకు రిజుజు రూ.20 లక్షల నగదు బహుమానం అందించారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications