ఫేవరేట్‌గా బరిలోకి: చైనా ఓపెన్‌పై కన్నేసిన పీవీ సింధు

హైదరాబాద్: ఇటీవలే వరల్డ్ ఛాంపియన్‌షిప్ ముగిసింది. మహిళల సింగిల్స్‌లో విశ్వ విజేతగా పీవీ సింధు అవతరించింది. కాగా, మంగళవారం నుంచి చైనాలోని చాంగ్‌ఝౌ వేదికగా జరగనున్న చైనా ఓపెన్‌లో మహిళల సింగిల్స్‌లో పీవీ సింధు ఐదో సీడ్‌గా, సైనా నెహ్వాల్ ఎనిమిదో సీడ్‌గా బరిలోకి దిగనున్నారు.
బుధవారం జరిగే తొలి రౌండ్‌లో భాగంగా సింధు.. చైనాకు చెందిన షట్లర్ లి ఝురుయ్ తలపడనుంది. మరోవైపు మహిళల సింగిల్స్‌లో సైనా నెహ్వాల్ ప్రపంచ 19వ ర్యాంకర్, థాయ్ షట్లర్ బుసానన్ ఆంగ్‌బామ్‌రంగ్‌ఫాతో తలపడనుంది. లీ జురుయ్‌తో ముఖాముఖి రికార్డులో సింధు 3-3తో సమంగా ఉండగా, సైనా 3-1తో బుసానన్‌పై ఆధిక్యంలో ఉంది.
మాజీ వరల్డ్ చాంపియన్ కరోలినా మారిన్, విక్టర్ అక్సెల్‌సెన్ గాయాల నుంచి కోలుకున్న తర్వాత ఈ టోర్నీలో ఆడుతున్నారు. పురుషుల సింగిల్స్‌లో కిదాంబి శ్రీకాంత్, ప్రణయ్ అనారోగ్య కారణాలతో టోర్నీకి దూరమయ్యారు. దీంతో ప్రపంచ ఛాంపియన్‌షిప్ కాంస్య పతక విజేత భమిడిపాటి సాయిప్రణీత్, కశ్యప్ తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
ఈ టోర్నీ తొలి రౌండ్‌లో నాలుగో సీడ్ నొజోమి ఒకుహారా (జపాన్)తో మారిన్ ఆడుతుంది. డబుల్స్‌లో సాత్విక్-చిరాగ్ షెట్టి, మను అత్రి-సుమీత్ రెడ్డి, అశ్విని-సిక్కిరెడ్డి జోడీలు బరిలో దిగనున్నాయి. మిక్స్‌డ్‌లో సాత్విక్-అశ్విని, సిక్కిరెడ్డి-ప్రణవ్ జెర్రీ చోప్రా జంటలు ఆడనున్నాయి. 2016లో ఈ టోర్నీలో విజేతగా నిలిచిన పీవీ సింధు అదే ఫలితాన్ని ఈసారి పునరావృతం చేయాలని భావిస్తోంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications