For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నా కోసం ఇంతమంది వస్తారనుకోలేదు: సింధు, కేసీఆర్ వల్లే: గోపీచంద్

హైదరాబాద్: ఒలింపిక్స్‌లో రజతం సాధించిన సాధించిన పీవీ సింధును, కోచ్ గోపీచంద్‌ను తెలంగాణ ప్రభుత్వం సోమవారం నాడు ఘనంగా సన్మానించింది. ఈ సందర్భంగా సింధు, గోపీచంద్‌లు గచ్చిబౌలి స్టేడియంలో ఏర్పాటు చేసిన అభినందన సభలో మాట్లాడారు.

తొలుత సింధు మాట్లాడుతూ.. ' అందరికీ నమస్కారం. మీ ఆశీర్వాదం వల్లే నేను ఇక్కడ ఉన్నాను. ముఖ్యంగా నా గురువు గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఆయన వల్లే నేను ఇక్కడ ఉన్నాను. తెలంగాణ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్‌కు ధన్యవాదాలు. ఇంతమంది నా కోసం ఇక్కడ ఉండారని నేను ఊహించలేదు. మరిన్ని సాధించి మీ ముందు నిలబడతాను. ప్రజలందరి వల్లే ఈ స్థాయికి వచ్చాను' అని చెప్పారు.

అనంతరం గోపీచంద్ మాట్లాడుతూ... 'సభకు నమస్కారం. మొట్ట మొదట తెలంగాణ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి కృతజ్ఞతలు. ఇంత భారీ ఏర్పాట్లు చేయడం సంతోషం. విమానాశ్రయం నుంచి వచ్చేటప్పుడు చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా అందరూ మమ్మల్ని అభినందించారు.

PV Sindhu excitement for Telangana Government receiving

ఈ రోజు మేం ఇక్కడ ఉండటానికి మీరంతా మద్దతు ఇవ్వడమే. ప్రభుత్వం మద్దతు ఇవ్వడమే. 2000లో కరణం మల్లీశ్వరి ఒలింపిక్స్ పతకం సాధించిన తర్వాత, ఆమెను చూసి నేను స్ఫూర్తి పొందాను. ఇప్పుడు సింధును చూసి విద్యార్థులు స్ఫూర్తి పొందుతారు.

ఒలింపిక్స్‌లో మన దేశానికి ప్రతిష్ట తెచ్చిన ఇద్దరు అమ్మాయిలు పీవీ సింధు, సాక్షి మాలిక్‌లు. మాకు ప్రభుత్వం నుంచి మంచి మద్దతు లభించింది. తెలంగాణ గురించి ఇప్పుడు అన్ని విషయాల్లో గొప్పగా చెప్పుకుంటున్నాం. ఆటల విషయంలోను అలాగే నిలుస్తుంది. మాకు అండగా నిలబడిన తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు. ప్రభుత్వ మద్దతు, అండ భవిష్యత్తులో ఉండాలని కోరుకుంటున్నా' అన్నారు.

Story first published: Wednesday, November 15, 2017, 12:22 [IST]
Other articles published on Nov 15, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+