For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చైనా ఓపెన్‌లో శుభారంభాన్ని నమోదు చేసిన సింధు

PV Sindhu enters second round of Fuzhou China Open

హైదరాబాద్: చైనా ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీలో భారత్‌కు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. స్టార్‌ షట్లర్‌ పి.వి.సింధు శుభారంభాన్ని నమోదు చేసి.. రెండో రౌండ్‌లోకి ప్రవేశించింది. మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్‌ తొలిరౌండ్లో సింధు 21-13, 21-19తో రష్యాకు చెందిన ఎవ్‌గెనియా కొసెత్సకయాను ఓడించింది.

వరుస ఆరు పాయింట్లు సాధించి 1-0లీడ్‌తో తొలి రౌండ్ ఆధిక్యాన్ని చాటింది. కేవలం 29 నిమిషాల్లోనే ముగిసిన పోరులో తొలి గేమ్‌ను సులువుగా దక్కించుకున్న మూడో సీడ్ తెలుగు షట్లర్..రెండో గేమ్‌లో చెమటోడ్చాల్సి వచ్చింది. అన్ సీడెడ్‌గా బరిలోకి దిగిన రష్యా ప్రత్యర్థి సింధును ముప్పు తిప్పలు పెట్టింది.

రెండో రౌండ్‌లో అన్‌సీడెడ్ బుసానన్ ఒన్బామ్రుగ్‌ఫన్(థాయ్‌లాండ్)తో సింధు తలపడుతుంది. మూడో సీడ్ సింధు రెండోరౌండ్లో అన్‌సీడెడ్‌ బుసానన్‌ (థాయ్‌లాండ్‌)తో తలపడనుంది. కాగా, డబుల్స్‌లో భారత పోరాటం ఆరంభ రౌండ్లోనే ముగిసింది.

మహిళల డబుల్స్‌లో భారత్ జోడి సిక్కిరెడ్డి-అశ్వినీ పొన్నప్ప జోడీ 19-21, 21-15, 17-21తో జపాన్‌ జంట షిహో తనక-కొహరు చేతిలో పోరాడి ఓడగా.. పురుషుల డబుల్స్‌లో సుమిత్‌ రెడ్డి-మను అత్రి ద్వయం 16-21, 25-27తో డెన్మార్క్‌ జంట కిమ్‌-రాస్‌ముసెన్‌ చేతిలో ఓడింది.

Story first published: Wednesday, November 7, 2018, 14:31 [IST]
Other articles published on Nov 7, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+