షాక్, ఇద్దర్ని టార్గెట్ చేసిన ఫ్యాన్స్: సానియా వద్దు.. పీవీ సింధు ముద్దు!
హైదరాబాద్: రియో ఒలింపిక్స్ 2016లో పీవీ సింధు ఫైనల్ చేరుకుంది. ఈ రోజు సాయంత్రం ఆరు గంటల యాభై అయిదు నిమిషాలకు ఫైనల్ ప్రారంభమవుతుంది. సింధు ఫైనల్లో గెలిచి స్వర్ణం గెలవాలని యావత్ భారత దేశం పూజలు చేస్తోంది.
పీవీ సింధు ఫైనల్‌కు చేరిన నేపథ్యంలో కొందరు.. ఇద్దరు క్రీడాకారిణిలను టార్గెట్ చేస్తున్నారు. అందులో ఒకరు సైనా నెహ్వాల్. మరొకరు సానియా మీర్జా. ఇప్పటికే సైనా పైన ఓ క్రీడాభిమాని.. సైనా బ్యాగ్ సర్దుకొని రావాలని ట్వీట్ చేశారు. దానికి సైనా హుందాగా సమాధానం చెప్పింది. అలాగే చేస్తానని, పీవీ సింధు పతకం సాధిస్తుందని ఆకాంక్షించింది. దీంతో సదరు అభిమాని పశ్చాత్తాపపడ్డాడు.
సానియా మీర్జాను కూడా టార్గెట్ చేస్తున్నారు. తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్‌గా సానియా మీర్జా స్థానంలో మన సంస్కృతి, సంప్రదాయాలను గౌరవించే పీవీ సింధుని ఎంపిక చేయాలని డిమాండ్ చేస్తున్నామంటూ.. ఫేస్‌బుక్‌లో ఓ కామెంట్, ఫోటో హల్ చల్ చేస్తోందిత.

తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్
తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్‌కు సానియా మీర్జాను తొలగించి, పీవీ సింధును ఎంపిక చేయాలని సోషల్ మీడియాలో పలువురు డిమాండ్ చేస్తున్నారు. వీటికి పెద్ద ఎత్తున లైక్స్ వస్తున్నాయి.

పీవీ సింధు
గతంలో ఓసారి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావును కలిసిన బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు.

బోనం ఎత్తిన సింధు
బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు ఈ ఏడాది బోనం ఎత్తారు. అమ్మవారికి బోనం సమర్పించుకున్నందునే సింధు పతకం గెలుస్తుందని అభిమానులు అంటున్నారు. అమ్మకు బోనం ఎత్తింది, పతకం తెస్తోందని సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.

బతుకమ్మ పట్టుకున్న సింధు
బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు గతంలో బతుకమ్మను పట్టుకున్న దృశ్యం. సింధు రియో ఒలింపిక్స్‌లో ఫైనల్ చేరుకున్న విషయం తెలిసిందే.

పీవీ సింధు
బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు ఈ ఏడాది బోనం ఎత్తారు. అమ్మవారికి బోనం సమర్పించుకున్నందునే సింధు పతకం గెలుస్తుందని అభిమానులు అంటున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications