చిత్తూరు: బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు రియో ఒలింపిక్స్ 2016లో స్వర్ణం సాధించడానికి మరో అడుగు దూరంలో ఉంది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఆమె ఫైనల్‌లో స్పెయిన్ క్రీడాకారిణి మారిన్ పైన గెలవాలని ప్రత్యేక పూజలు చేస్తున్నారు.
ఇందులో భంగాగా ఏపీలోని చిత్తూరు జిల్లా తిరుపతిలో పలువురు సుమారు వంద కొబ్బరి కాయలు కొట్టారు. పీవీ సింధు స్వర్ణం గెలవాలని కాంక్షిస్తూ బ్యానర్ పట్టుకున్నారు. కొబ్బరికాయలు కొట్టి సింధు ఫోటోకి హారతి ఇచ్చారు. అనంతరం ఫోటోకి దిష్టి తీశారు.
ఫోటో గ్యాలరీ : రియో దాకా సింధు
సింధు తప్పక గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. భారత్‌కి సింధు పసిడి పతకంతోనే తిరిగి వస్తుందన్నారు. హైదరాబాదులోను పలు ఆలయాలలో క్రీడాభిమానులు పూజలు చేసిన విషయం తెలిసిందే. ఇంకా చేస్తున్నారు.

దేశ వ్యాప్తంగా అభిమానులు పూజలు చేస్తున్నారు. సింధుపై భారతావని ఎన్నో ఆశలు పెట్టుకుంది. ఢిల్లీ, వారణాసిలలో కూడా సింధు గెలవాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెలుగు రాష్ట్రాల్లో ఇది మరింత ఎక్కువగా కనిపిస్తోంది.
మెహిదీపట్నం కాలేజీలో
హైదరాబాదులోని మెహిదీపట్నంలోని ఓ కాలేజీలో సింధూ నామస్మరణ మార్మోగింది. ఇలాగే తెలుగు రాష్ట్రాలలోని పలు కాలేజీల్లో ఉన్నాయి. ఈ రోజు సాయంత్రం జరగనున్న ఫైనల్లో సింధూ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు.