హైదరాబాద్: ఒలింపిక్ రజక పతక విజేత, భారత స్టార్ షట్లర్ పీవీ సింధుకు అరుదైన గౌరవం లభించింది. ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) అథ్లెట్ల కమిషన్‌లో సభ్యురాలిగా సింధు ఎంపికైంది. అథ్లెట్ల కమిషన్‌లో ముగ్గురు మహిళా సభ్యుల కోసం ఆస్ట్రేలియాలోని గోల్ట్ కోస్ట్‌లో జరిగిన ఓటింగ్‌లో పీవీ సింధుకు 129 ఓట్లు లభించాయి.
మిగతా ముగ్గురు సభ్యులుగా స్కాట్లాండ్‌కు చెందిన క్రిస్టీ గిల్మోర్ (103), లిత్వేనియా షట్లర్ అక్విలె (25) లభించాయి. ఇక పురుషుల విభాగంలో మార్క్ జ్వీబ్లెర్ (జర్మనీ)కు సభ్యత్వం లభించింది. ఈ సభ్యులంతా నాలుగేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగుతారు.

బీడబ్ల్యూఎఫ్ సభ్యురాలిగా నన్ను ఎంపికచేసుకున్నందుకు కృతజ్ఞతలు. నా ఈ కొత్త పదవికి పూర్తిగా న్యాయం చేస్తాను అని సింధు సంతోషం వ్యక్తం చేసింది. సింధుకు భారత బ్యాడ్మింటన్ సమాఖ్య అధ్యక్షుడు హిమంత బిస్వా శర్మ అభినందనలు తెలిపారు.
బీడబ్ల్యూఎఫ్ ఎన్నికల ఫలితాలు:
1) PV Sindhu (India) - 129 votes
2) Marc Zwiebler (Germany) - 108 votes
3) Kirsty Gilmour (Scotland) - 103 votes
4) Koo Kien Keat (Malaysia) - 91 votes
5) Yoo Yeon Seong (Korea) - 89 votes
6) Edwin Ekiring (Uganda) - 35 votes
7) Luis Ramon Garrido Esquivel (Mexico) - 32 votes
8) Akvilė Stapusaityte (Lithuania) - 25 votes
9) Nikhar Garg (India) - 6 votes