హైదరాబాద్: చైనా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్-1000 టోర్నమెంట్లో భారత స్టార్ షట్లర్, వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ పీవీ సింధుకు గట్టి షాక్ తగిలింది. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్‌లో పీవీ సింధు ఓటమిపాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది.
ప్రీ క్వార్టర్ ఫైనల్స్‌లో భాగంగా జరిగిన మ్యాచ్‌లో పీవీ సింధు 21-12, 13-21, 19-21 తేడాతో థాయిలాండ్ క్రీడాకారిణి పోర్న్‌పావీ చోచువాంగ్ చేతిలో ఓడిపోయింది. సుమారు 50 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్ ఆద్యంతం ఉత్కంఠగా కొనసాగింది.
తొలి గేమ్‌ను పీవీ సింధు 21-12తో కైవసం చేసుకుంది. అయితే, రెండో గేమ్‌లో అనూహ్యంగా పుంజుకున్న పోర్న్‌పావీ చోచువాంగ్ అద్భుతమైన షాట్లతో 21-13తో గెలిచి గేమ్‌ను సమం చేసింది. నిర్ణయాత్మక మూడో గేమ్‌లో చోచువాంగ్ 15 పాయింట్లతో ఉన్నప్పుడు వరుసగా ఆరు పాయింట్లు సాధించిన చోచువాంగ్ గేమ్‌తో పాటు మ్యాచ్‌ని సొంతం చేసుకుంది.
#NewsInGenes | #SportInGenes #Indian 🇮🇳Badminton 🏸 #PROUD "PV Sindhu" @Pvsindhu1
— Sport In Genes (@SportInGenes) September 19, 2019
crashed former Olympic champion "Li Xue Rui" at #ChinaOpenSuper1000#SportsNews #Badminton #badmintonworldchampionships2019 #pvsindhu #sindhu
👉👉 Watch the Highlights:pic.twitter.com/jOLIflgF66
క్వార్టర్స్‌లో చోచువాంగ్ చైనా క్రీడాకారిణి చెన్ యుఫీతో తలపడనుంది. అంతకముందు రెండో రౌండ్లో పీవీ సింధు ఒలింపిక్ స్వర్ణ పతక విజేత లీ జురుయ్ (చైనా)పై 21-18, 21-12తో విజయం సాధించి ప్రిక్వార్టర్‌కు చేరుకున్న సంగతి తెలిసిందే. మరో షట్లర్ సైనా నెహ్వాల్ కూడా తొలి రౌండ్లోనే ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించిన సంగతి తెలిసిందే.