Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

'ఏదో ఒకరోజు మారిన్‌ను ఓడిస్తుంది': ఓటమిపై సింధు ఏం చెప్పింది

హైదరాబాద్: రియో ఒలింపిక్స్‌లో బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్‌లో భాగంగా శుక్రవారం రాత్రి జరిగిన ఫైనల్ మ్యాచ్ హోరాహోరీగా సాగింది. వరల్డ్ ర్యాంకింగ్‌‌లో 10వ స్థానంలో ఉన్న సింధు, వరల్డ్ నెంబర్ వన్ కరోలినా మారన్ మధ్య జరిగిన ఈ మ్యాచ్ సుదీర్ఘంగా మూడు సెట్ల పాటు సాగింది.

తొలి సెట్‌ను కైవసం చేసుకున్న సింధు, ఆ తర్వాత రెండు సెట్లను కోల్పోయిన భారత్‌కు రజత పతకాన్ని అందించిన సంగతి తెలిసిందే. మ్యాచ్ అనంతరం మీడియాతో మాట్లాడిన సింధు అసలు తాను రియో ఒలింపిక్స్ లో రజత పతకం సాధిస్తానని అనుకోలేదని చెప్పింది.

ఆటలో గెలుపోటములు సహజమని పేర్కొన్న సింధు తన ప్రదర్శన పట్ల గర్విస్తున్నానని చెప్పింది. చాలా సంతోషంగా ఉందని, పోటీ అద్భుతంగా సాగిందని పేర్కొంది. స్వర్ణం సాధిస్తానని అనుకున్నానని, అందుకోసం ఫైనల్ మ్యాచ్ కు బాగా ప్రిపేర్ అయ్యానని తెలిపింది.

ఏదో ఒకరోజు మారిన్‌ను ఓడిస్తుంది

ఏదో ఒకరోజు మారిన్‌ను ఓడిస్తుంది

అయితే ప్రత్యర్థి మారిన్ ఆట తీరు మెరుగ్గా ఉందని చెప్పింది. దేశానికి ఓ అమ్మాయి (సాక్షి మాలిక్) కాంస్య పతకం అందించిన ఒక రోజు వ్యవధిలోనే తాను కూడా పతకం సాధించడం ఆనందంగా ఉందని పేర్కొంది. రియో ఆటగాళ్లు అందరూ బాగా ఆడారని, జీవితంలో ఉన్నట్లే ఆటలో కూడా ఎత్తుపల్లాలు ఉంటాయని చెప్పింది.

ఏదో ఒకరోజు మారిన్‌ను ఓడిస్తుంది

ఏదో ఒకరోజు మారిన్‌ను ఓడిస్తుంది

అందరికీ అభినందనలు తెలిపిన సింధు, ఈ వారం తనకు ఎంతో అద్భుతంగా గడిచిందని పేర్కొంది. భారతీయురాలినైనందకు ఎంతో గర్విస్తున్నానని చెప్పింది. మరోవైపు సింధు కోచ్ పుల్లెల గోపీచంద్ మాట్లాడుతూ గత కొద్ది రోజులుగా పీవీ సింధు అద్భుతంగా ఆడుతోందని అన్నారు.

 ఏదో ఒకరోజు మారిన్‌ను ఓడిస్తుంది

ఏదో ఒకరోజు మారిన్‌ను ఓడిస్తుంది

ఒలింపిక్స్ ఫైనల్ మ్యాచ్‌లో ఆమె ఆటతీరు తాను గర్వించేలా ఉందని అన్నారు. ఫైనల్ మ్యాచ్‌లో కోర్టులో సింధు కదిలిన తీరు, పోరాట పటిమ అద్భుతమని కొనియాడాడు. తమ కష్టానికి ఫలితం దక్కిందని, సింధు అత్యుత్తమంగా ఆడిందని కితాబిచ్చాడు.

 ఏదో ఒకరోజు మారిన్‌ను ఓడిస్తుంది

ఏదో ఒకరోజు మారిన్‌ను ఓడిస్తుంది

మారిన్ కూడా ఎంతో అద్భుతంగా ఆడిందని, తన కంటే బాగా ఆడిన క్రీడాకారిణి చేతిలో సింధు ఓడిందని, దీని నుంచి పాఠాలు నేర్చుకుంటామని చెప్పాడు. సింధు మళ్లీ పుంజుకుంటుందని, ఏదోక రోజు మారిన్‌ను ఓడిస్తుందని గోపీచంద్ విశ్వాసం వ్యక్తం చేశాడు.

ఏదో ఒకరోజు మారిన్‌ను ఓడిస్తుంది

ఏదో ఒకరోజు మారిన్‌ను ఓడిస్తుంది

రెండో గేమ్ మొదట్లో సింధు తడబడిందని, మూడో గేమ్ కొన్ని అనవసర తప్పిదాల వల్ల సింధు మ్యాచ్ కోల్పోయిందని పేర్కొన్నాడు. చిన్నవయసులోనే సింధు ఒలింపిక్ పతకం సాధించిందని, ఆమెకు ఉజ్వలమైన భవిష్యత్ ఉందని చెప్పాడు. ఆటపట్ల సింధు శ్రమిస్తుందని, భవిష్యత్‌లో అగ్రశేణి క్రీడాకారిణి అవుతుందని అన్నాడు.

Story first published: Tuesday, November 14, 2017, 10:11 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+