
హైదరాబాద్: భారత స్టార్ షట్లర్ పీవీ సింధు గురువారం (జులై 5)న 23వ పుట్టినరోజుని జరుపుకుంటోంది. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో పీవీ సింధుకు అభిమానులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ప్రస్తుతం పీవీ సింధు ఇండోనేషియా ఓపెన్‌లో ఆడుతోంది.
విజయవాడలో పుట్టిన పీవీ సింధు ఎనిమిదేళ్ల నుంచే బ్యాడ్మింటన్‌ను కెరీర్‌గా ఎంచుకుంది. సింధు తల్లిదండ్రులు కూడా క్రీడాకారులు కావడంతో ఆమెను బాగా ప్రోత్సహించారు. జాతీయ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ వద్ద శిక్షణ తీసుకుంటోన్న సింధు అనేక టైటిళ్లను సొంతం చేసుకుంది.
టోర్నీలో భాగంగా బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో సింధు 21-15, 19-21, 21-13తో చొచువాంగ్ (థాయ్‌లాండ్)పై విజయం సాధించింది. మొత్తం 36 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో సింధూ ఒహొరిపై వరుసగా రెండు గేమ్స్ గెలిచి క్వార్టర్ ఫైనల్‌లో అడుగుపెట్టింది.
ఇదిలా ఉంటే గురువారం సింధు పుట్టినరోజు. బర్త్‌డే రోజున సింధు విజయం సాధించి క్వార్టర్స్‌కు దూసుకెళ్లడం మరో విశేషం. క్వార్టర్స్‌లో సింధు.. చైనాకు చెందిన బింగ్జియావోతో తలపడనుంది.