థాయ్‌లాండ్ ఓపెన్: సెమీస్‌కు చేరిన పీవీ సింధు

హైదరాబాద్: బ్యాంకాక్ వేదికగా జరుగుతున్న థాయ్‌లాండ్ ఓపెన్‌లో రియో ఒలింపిక్ రజత పతక విజేత పీవీ సింధు మరోసారి సత్తా చాటింది. పీవీ సింధు మహిళల సింగిల్స్ సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన మహిళల క్వార్టర్ ఫైనల్లో మలేసియాకు చెందిన సోనియా చెహ్‌ను 21-17, 21-13 తేడాతో వరుస గేముల్లో అలవోకగా గెలిచింది.
శనివారం జరిగే సెమీఫైనల్లో ప్రపంచ మూడో ర్యాంకు సింధు తర్వాతి రౌండ్లో ఇండోనేసియా క్రీడాకారిణి మారిస్క తున్‌జుంగ్‌తో తలపడుతుంది. ముఖాముఖి రికార్డులో సింధు 2-0తో ఆధిక్యంలో ఉంది. క్వార్టర్స్‌లో జరిగిన తొలి గేమ్‌లో సింధు కాస్త తడబడటంతో సోనియా 11-7తో దూసుకుపోయింది.
ఆ తర్వాత పుంజుకున్న సింధు వరుసగా ఐదు పాయింట్లు సాధించి 13-12తో నిలిచి, గేమ్‌ను సొంతం చేసుకుంది. రెండో గేమ్‌లో తొలుత సింధు 6-3తో ముందంజ వేసినా సోనియా పుంజుకొని 8-8తో స్కోరు సమం చేసింది. విరామం తర్వాత దూకుడుగా ఆడిన సింధు 11-9తో ఆధిక్యంలోకి వెళ్లి 21-13తో గేమ్‌తో పాటు మ్యాచ్ సొంతం చేసుకుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications