
రెండు వరుస సెట్లలో సింధు 21-15, 21-12తో మిచెల్లీని ఓడించింది. ప్రస్తుతం పివి సింధు ప్రపంచస్థాయిలో పదకొండవ ర్యాంకులో ఉంది.
అంతకుముందు సింధు మలేసియా ఓపెన్ గ్రాండ్ ప్రీ గోల్డ్‌ను మే నెలలో గెల్చుకుంది. అనంతరం ఆగస్టులో జరిగిన ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో బ్రాండ్ మెడల్ గెలుచుకుంది.
కాగా, ఆంధ్ర ప్రదేశ్ యువ సంచలనం పివి సింధు రెండు రోజుల క్రితం హాంకాంగ్‌కు చటెందిన ఐదో సీడ్ చాన్ త్సును 21-17, 21-12తో ఓడించింది. తద్వారా సెమీ ఫైనల్లోకి ప్రవేశించింది. సెమీ ఫైనల్లో చైనీస్‌కు చెందిన కిన్ జింగింగ్‌ను 21-13, 18-21, 21-19తో మట్టి కరిపించింది.