
ఫ్లయింగ్ సిక్ మిల్కా సింగ్‌కు లెజెండ్ ఆఫ్ ద ఇయర్ అవార్డు
లెజెండ్ ఆఫ్ ద ఇయర్ అవార్డుకు ఫ్లయింగ్ సిక్ మిల్కా సింగ్ ఎంపికయ్యాడు. అయితే కొన్ని కారణాల వల్ల ఈ ఫంక్షన్‌కు ఆయన హాజరు కాలేకపోయాడు. ఈ ఏడాది ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరిస్ ద్వారా టెస్టు క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన కేఎల్ రాహుల్‌కి గేమ్ ఛేంజర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు లభించింది.

అభినవ్ బింద్రాకు లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు
2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో బంగారు పతకాన్ని సాధించిన షూటర్ అభినవ్ బింద్రాకు లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు లభించింది. వీరితో పాటు పారా అథ్లెట్లు దేవేంద్ర ఝఝారియా, మరియప్పన్ తంగవేలు, వరుణ్ భారతి, దీపా మాలిక్‌లకు కూడా అవార్డులను అందుకున్నారు.

హాజరైన జ్వాలా గుత్తా, క్రికెటర్ ప్రజ్ఞాన్ ఓజా
ఈ అవార్డుల కార్యక్రమానికి బ్యాడ్మింటన్ ప్లేయర్ జ్వాలా గుత్తా, పుట్ బాల్ గ్రేట్ బైటింగ్ భూటియా, బాక్సర్ అమీర్ ఖాన్, క్రికెటర్ ప్రజ్ఞాన్ ఓజాలు హాజరయ్యారు.

అవార్డుల పూర్తి జాబితా:
Sportsperson Of The Year: PV Sindhu
Special award for service to Sports: Jayant Rastogi, CEO, Magic Bus.
Team of the year: Junjor Men's Hockey Team received by Captain Harjeet Singh.
Coach of the year: Pullela Gopichand.
Editor's Award for excellence: Devendra Jhajharia, MariyappanThangavelu, Varun Bhati.
Outstanding Contribution to sports: K Arumugam.
Athlete of the year: Gaurav Gill.
Gamechanger of the year: KL Rahul.
Extreme Performer of the year: Shiva Keshavan.
Lifetime Achievement Award: Abhinav Bindra.
Community Development through sports: Milind Soman (Received by his mother Usha Soman).
Inspirational athlete of the year: Deepa Malik.
Living Legend: Milkha Singh.


Click it and Unblock the Notifications