Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

India Open: సింధు, శ్రీ‌కాంత్ శుభారంభం.. డ‌బుల్స్‌లోనూ విజ‌యాలు

PV Sindhu and Kidambi Srikanth win first round of India Open

న్యూఢిల్లీ: ఇండియా ఓపెన్ 500 బ్యాడ్మింట‌న్ టోర్నీలో తొలి రోజు భార‌త ఆట‌గాళ్లు శుభారంభం చేశారు. టాప్ సీడ్లు పీవీ సింధు, కిదాంబి శ్రీ‌కాంత్‌తోపాటు మిగ‌తా వాళ్లు కూడా త‌దుప‌రి రౌండ్‌కు అర్హ‌త సాధించారు. ఇటు డ‌బుల్స్‌, మిక్స్‌డ్ డ‌బుల్స్‌లోనూ భార‌త ఆట‌గాళ్లు ముందంజ వేశారు.

ప్రిక్వార్ట‌ర్స్‌కు సింధు

ప్రిక్వార్ట‌ర్స్‌కు సింధు

మ‌హిళ‌ల సింగిల్స్ తొలి రౌండ్‌లో పీవీ సింధు మ‌న దేశానికే చెందిన శ్రీ‌కృష్ణ ప్రియ‌పై 21-5, 21-16 తేడాతో విజ‌యం సాధించింది. త‌ద్వారా ప్రిక్వార్ట‌ర్స్‌లోకి సింధు అడుగుపెట్టింది. తొలి సెట్‌ను 21-5తో సునాయ‌సంగా గెలుచుకున్న సింధుకు రెండో సెట్‌లో మాత్రం శ్రీ‌కృష్ణ ప్రియ పోటీ ఇచ్చింది. అయితే సింధునే చివ‌రికి పై చేయి సాధించింది. దీంతో సింధు 21-16తో సెట్‌తోపాటు మ్యాచ్‌ను కూడా కైవ‌సం చేసుకుంది.

 శ్రీ‌కాంత్ శుభారంభం

శ్రీ‌కాంత్ శుభారంభం

పురుషుల సింగిల్స్‌లో కిదాంబి శ్రీ‌కాంత్‌ భార‌త్‌కే చెందిన సిరిల్‌ వర్మపై 21-17, 21-10 తేడాతో విజ‌యం సాధించాడు. త‌ద్వారా శ్రీ‌కాంత్ ప్రిక్వార్ట‌ర్స్‌కు చేరుకున్నాడు. శ్రీ‌కాంత్‌కు తొలి సెట్‌లో సిరిల్ వ‌ర్మ మంచి పోటీనే ఇచ్చాడు. అయితే సెట్‌ను శ్రీ‌కాంత్ 21-17తో గెలుచుకున్నాడు. ఇక సెకండ్ సెట్‌ను శ్రీ‌కాంత్ ఏక‌ప‌క్షంగా ముగించాడు. ఈ సెట్‌ను 21-10 తేడాతో సునాయ‌సంగా గెలుచుకున్నాడు. మ‌రో మ‌హిళ‌ల సింగిల్స్ మ్యాచ్‌లో భారత్‌కే చెందిన అష్మిత చాలియా 24-22, 21-16 తేడాతో ర‌ష్యాకు చెందిన‌ ఐదో సీడ్‌ ఎవగెనియా కొసెత్‌స్కాయా పై సంచలన విజయం న‌మోదు చేసింది. త‌ద్వారా ప్రీ క్వార్ట‌ర్స్‌కు దూసుకెళ్లింది.

డ‌బుల్స్‌లో భారత్ శుభారంభం

డ‌బుల్స్‌లో భారత్ శుభారంభం

మహిళల డబుల్స్‌ తొలి రౌండ్‌లో భార‌త్‌కు చెందిన గాయత్రి గోపీచంద్‌-త్రిషా జాలీ జంట 21-12, 21-10 తేడాతో ఉక్రెయిన్‌కు చెందిన‌ ప్రొజొరోవా-రుదకోవా జంట‌పై నెగ్గి ప్రిక్వార్ట‌ర్స్‌కు అర్హ‌త సాధించింది. రెండు సెట్లలోనూ భార‌త జంట సునాయ‌సంగా విజ‌యం సాధించింది.

ఇక మిక్స్‌డ్‌ డబుల్స్‌ తొలి రౌండ్‌లో భార‌త్‌కు చెందిన గాయత్రి గోపీచంద్‌-సాయిప్రతీక్ జంట 21-16, 16-21, 21-17తో భార‌త్‌కే చెందిన ఇషాన్‌ భట్నాగర్‌-తనీషా క్రాస్టో జోడిపై విజ‌యం సాధించింది. భార‌త్‌కు చెందిన సిక్కి రెడ్డి-ధ్రువ్‌ కపిల 21-11, 21-11 తేడాతో భార‌త్‌కే చెందిన చిరాగ్‌ అరోరా-నిషు రాప్రియా గెలుపొంది ప్రీక్వార్ట‌ర్స్‌లోకి అడుగుపెట్టింది.

Story first published: Wednesday, January 12, 2022, 8:37 [IST]
Other articles published on Jan 12, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+