43వ పడిలోకి గోపీచంద్: హ్యాపీ బర్త్‌డే అంటూ ట్వీట్స్
హైదరాబాద్: భారత్ మాజీ బ్యాడ్మింటన్ ప్లేయర్ పుల్లెల గోపీచంద్ బుధవారం (నవంబర్ 16)వ తేదీన 43వ పుట్టినరోజుని జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. భారత బ్యాడ్మింటన్ రూపురేఖల్నే మార్చిన గోపీచంద్ తన అకాడమీ ద్వారా ఎంతో మంది యువ క్రీడాకారుల్ని తయారు చేశాడు.
తాను సాధించలేని ఒలింపిక్స్ పతకాలను తన శిష్యుల ద్వారా సాధించి తన కోరికను నెరవేర్చుకున్నాడు. బ్యాడ్మింటన్‌లో భారత్‌కు రెండు ఒలింపిక్ పతకాలు తెచ్చేలా శిక్షణ ఇచ్చాడు. రియో ఒలింపిక్స్‌లో రజత పతక విజేత పీవీ సింధుతో పాటు కిదాంబి శ్రీకాంత్, బాయ్ గోపీకి ట్విట్టర్‌లో శుభాకాంక్షలు తెలిపారు.
2003లో కోచ్‌గా రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన గోపీ అకాడమీని ప్రారంభించిన గోపీచంద్.... 2012 లండన్ ఒలింపిక్స్‌లో సైనా నెహ్వాల్ కాంస్యం గెలిచేలా శిక్షణ ఇచ్చాడు. రియో ఒలింపిక్స్‌లో పీవీ సింధుతో రజతం గెలిపించి బ్యాడ్మింటన్ క్రీడలో భారత చరిత్రను ప్రపంచానికి చాటాడు.

2001లో ఆల్ ఇంగ్లండ్ టైటిల్ నెగ్గిన రెండో భారత ఆటగాడి
అకాడమీ కోసం ఇల్లు తాకట్టు పెట్టిన గోపీచంద్
2001లో ఆల్ ఇంగ్లండ్ టైటిల్ నెగ్గిన రెండో భారత ఆటగాడిగా రికార్డు సృష్టించిన గోపీచంద్ తర్వాత సొంత అకాడమీని స్థాపించాలని అనుకున్నాడు. అయినే దానిని నెలకొల్పడం కోసం ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నాడు. అకాడమీ కోసం తన ఇంటినే తాకట్టు పెట్టాడు. 2004లో 25 మంది పిల్లలతో అకాడమీ ప్రారంభమైంది. ఒలింపిక్స్‌లో పతకం సాధించాలన్న తన కల మాత్రం 2012లో జరిగిన లండన్ ఒలింపిక్స్‌లో సైనా ద్వారా తీరింది.

43వ పడిలోకి గోపీచంద్: హ్యాపీ బర్త్‌డే అంటూ ట్వీట్స్
అర్జున అవార్డు-1999
కేంద్రం ప్రభుత్వం నుంచి గోపీచంద్ అందుకున్న అవార్డులు
అర్జున అవార్డు-1999
రాజీవ్‌గాంధీ ఖేల్ రత్నా-2001
పద్మశ్రీ- 2005
ద్రోణాచార్య అవార్డు -2009
పద్మభూషణ్-2014

43వ పడిలోకి గోపీచంద్: హ్యాపీ బర్త్‌డే అంటూ ట్వీట్స్
రియో ఒలింపిక్స్ లక్ష్యంగా
రియో ఒలింపిక్స్ లక్ష్యంగా పీవీ సింధుని అత్యున్నత స్థాయిలో తీర్చిదిద్దాడు. అగ్రశ్రేణి క్రీడాకారిణుల్ని అవలీలగా ఓడించిన సింధులో నిలకడ లేకపోవడం ప్రధాన లోపమని గుర్తించిన గోపీచంద్ ఆ దిశగా సింధుని తీర్చిదిద్డాడు. రెండు నెలల పాటు ఆమెకు కఠోర శిక్షణ ఇచ్చాడు. డిఫెన్స్‌లో బలంగా తయారు చేశాడు. తద్వారా రియోలో గ్రూప్ దశలో మిచెలి లీ(కెనడా), ప్రిక్వార్టర్స్‌లో యింగ్ తైజు(చైనీస్ తైపీ), క్వార్టర్స్‌లో యివాన్ వాంగ్, సెమీస్‌లో ఒకుహర(జపాన్)లను సింధు ఓడించింది. ఫైనల్ పోరులో ప్రపంచ ఛాంపియన్ మారిన్‌పై సింధు త్రుటిలో విజయాన్ని చేజార్చుకుని భారత్‌కు రజతాన్ని అందించింది.

రియోతో రివార్డుల వెల్లువ
రియో సింధు గెలవడంతో గోపీచంద్‌కు అభినందనలు
రియో ఒలింపిక్స్‌లో పీవీ సింధు రజతం గెలుచుకోవడంతో కోచ్ గోపీని అభినందిస్తూ పలు ప్రభుత్వాలు నగదు రివార్డులను ప్రకటించాయి. ఇందులో భాగంగా తెలంగాణ ప్రభుత్వం రూ.కోటి ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ.50 లక్షల రివార్డును అందించగా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా రూ.10 లక్షలు ప్రకటించింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications