పీవీ సింధుతో 'సైనా'కు జవాబు: వెనుక ఒకేఒక్కడు 'మాస్టర్ మైండ్' గోపీచంద్
హైదరాబాద్: నిన్న సైనా నెహ్వాల్, నేడు పీవీ సింధు.. బ్యాడ్మింటన్‌లో అదరగొడుతున్నారు. వీరితో పాటు కిడాంబి శ్రీకాంత్.. ఇలా వీరి వెనుక ఉన్న ఒకే ఒక్కడు పుల్లెల గోపీచంద్.
ఫోటో గ్యాలరీ : రియో దాకా సింధు
ఈ ఆటగాళ్ల కష్టానికి రెండింతలు గోపీచంద్ వారి పైన శ్రద్ధ చూపిస్తుంటారు. ఆల్ ఇంగ్లాండ్ ఛాంపియన్‌షిప్ టైటిల్‌తో ఆటగాడిగా అత్యున్నత శిఖరాలు అధిరోహించిన గోపీచంద్.. ఆటగాళ్లను గెలిపించడంలో 'మాస్టర్ మైండ్' కోచ్‌గా అంతకంటే ఎక్కువ సాధించాడు.
క్రీడాకారులను ఎలా ఆడించాలి, ఎప్పుడు విశ్రాంతి ఇవ్వాలి, వారి ఫిట్‌నెస్, ఆహారం.. ఇలా అన్నీ గోపీకి తెలుసు.

సైనా నెహ్వాల్, పీవీ సింధు
2003లో కోచ్‌గా రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన గోపీ లక్ష్యం ఒలింపిక్స్ పతకం. తన లక్ష్యం చేరుకోడానికి సైనా నెహ్వాల్, కశ్యప్‌లను ఎంచుకున్నాడు. సైనా ఈ స్థాయికి ఎదగడం వెనుక గోపీచంద్ అన్నాడు. ప్రపంచ బ్యాడ్మింటన్‌లో అత్యంత బలమైన చైనా వాళ్లను మనం కొట్టవచ్చని నిరూపించేలా చేశాడు.

సైనా నెహ్వాల్
గోపీచంద్ కారణంగా సైనా నెహ్వాల్ అత్యున్నత శిఖరాలను అధిరోహించింది. బ్యాడ్మింటన్ క్రీడాకారుల పట్ల స్పాన్సర్లు అంత శ్రద్ధ చూపేవారు కాదు. కానీ దానిని గోపీచంద్.. తాను ఎన్నుకున్న ఆటగాళ్ల ద్వారా రివర్స్ చేశాడు. లండన్ ఒలింపిక్స్‌లో సైనా కాంస్యం సాధించింది. కారణం ఏమైనా రెండేళ్ల క్రితం సైనా.. గోపీచంద్‌కు దూరమైంది. ఆ సమయంలో గోపీచంద్ ఏమీ అనలేదు. ఇరువురి మధ్య విభేదాలు వచ్చినట్లుగా వార్తలు వచ్చాయి.

పీవీ సింధు
సైనా తర్వాత గోపీచంద్.. పీవీ సింధు పైన మరింత దృష్టి సారించాడు. గత పదేళ్లుగా సింధు గోపీచంద్ అకాడమీలో శిక్షణ పొందుతోంది. సైనా దూరమైన గోపీచంద్ ఏమీఅనలేదు. ఇప్పుడు పీవీ సింధుతో సమాధానం ఇచ్చాడని చెప్పవచ్చు.

గోపీచంద్
ఉదయం మూడు గంటలకే లేచి, ఆటగాళ్ల కంటే ఎక్కువ కష్టపడుతుంటాడు. ఉదాహరణకు రెండు మూడు గంటలు సింధుకు తర్ఫీదు, ఆ తర్వాత కిదాంబి శ్రీకాంత్‌కు, అనంతరం మరొకరికి.. ఇలా మేటి ఆటగాళ్లను తీర్చి దిద్దుతున్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications