Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

బాయ్ నిర్ణయాన్ని సమర్ధిస్తా: మద్దతు ఉంటుందన్న పుల్లెల గోపీచంద్

హైదరాబాద్: పాకిస్థాన్‌తో మ్యాచ్‌లు ఆడకూడదని బాయ్ తీసుకున్న నిర్ణయం సరైనదేనని బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. అక్టోబర్ 18 నుంచి 21వ తేదీ వరకు పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో జరగనున్న బ్యాట్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ అంతర్జాతీయ సిరీస్‌లో భారత్ పాల్గొనకూడదని భారత బ్యాట్మింటన్ అసోసియేషన్ (బాయ్) తీసుకున్న నిర్ణయాన్ని గోపీచంద్ సమర్ధించారు.

బాయ్ అధ్యక్షుడు అఖిలేష్ ఆలోచనకి తాము మద్దతిస్తున్నామని చెప్పారు. అంతర్జాతీయ సిరిస్‌లో పాల్గొనకూడదంటూ భారత్ తీసుకున్న నిర్ణయం సబబేనని అన్నారు. భారత్ తరుపున తీసుకున్న నిర్ణయాన్ని తాము తప్పక సమర్ధిస్తామని చెప్పారు.

Pullela Gopichand backs BAI's decision to boycott badminton series in Pakistan

కాగా, అంతకుముందు బ్యాట్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు అఖిలేష్ దాస్ గుప్తా ఈ టోర్నీ గురించి మాట్లాడారు. ఇస్లామాబాద్‌లో జరగనున్న బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ సిరీస్‌లో భారత క్రీడాకారులు ఎవరూ పాల్గొనడం లేదని ఆయన ప్రకటించారు.

Story first published: Wednesday, November 15, 2017, 12:22 [IST]
Other articles published on Nov 15, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+