For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

తెలుగు కవిత: రజత విజేత

By Pratap

తెలంగాణ తేజస్విని సింధూ రియోలో వెండివెన్నెై విరిసింది
ఈ మహావిజయంతో ప్రతి ఎదలో అవధులు లేని ఆనందపరవశం పండింది
యావత్ ప్రపంచం పండుగ చేసుకుంది
చరిత్రలో సువర్ణం రారాజుల కిరీటంలో ఆధిపత్యమై మెరుస్తుంది
వెండి సామాన్యజనుల ఆభరణం అలంకారం
నీవు జనబాహుళ్యంవైపు నిలిచావు
ప్రజాప్రాతినిధ్యం వహించావు
హైదరాబాదు కీర్తిని ఆకాశమంత ఎత్తుకు పెంచావు

 Prof Lakshminarayana's poem on PV Sindhu

రజతం తళతళలాడే తెలుపు
వెన్నెల తెల్లన హిమాలయాలు తెల్లన త్రివర్ణ పతాకంలో రంగు తెలుపు
పొద్దుపొడుపులో వెలుగు తెల్లన నల్లని మేఘంలో మెరుపు తెలుపు నగరంలో చార్మినార్ తెలుపు
విజయంలో అపజయం ఉంటుంది
ఓటమిలో పోరాటం ఉంటుంది
నీది వీరోచిత పోరాటం
అసలు గెలుపు ఓటమి కాదు పోరాడేవాడే వీరుడు
నీవు ఉప్పెనలా ఉవ్వెత్తున్న లేస్తున్న స్త్రీ చైతన్యాన్ని వేలరెట్లు ఉధృతం చేశావు
నీ తల్లిదండ్రుల కళ్లలోని కాంతి వెలుగులు సమకూర్చిన నీవు ఆడపడుచువెలా అవుతావు?
నీవు నిజంగా అసమాన పౌరుషంతో వీరవిహారం చేసిన సమకాలీన తెలంగాణ రుద్రమవు
నీ విజజయపరంపర ఇలాగే కొనసాగనీ
అజేయురాలివై తారల ఆకాశాల్ని అధిగమిస్తూ
వచ్చే ఒలింపిక్స్‌లో సాక్షాత్ సూర్యుణ్ని మెడలో మణిహారంగా ధరించు

- ప్రొఫెసర్ పి. లక్ష్మీనారాయణ
ఫోన్ 9542656636

Story first published: Wednesday, November 15, 2017, 12:22 [IST]
Other articles published on Nov 15, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+