Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఘనంగా బోణీ చేసి.. ఏకపక్షంగా గెలిచిన చెన్నై స్మాషర్స్‌

Premier Badminton League 2018: Chennai Smashers thrash Ahmedabad Smash Masters

పుణె: ప్రీమియర్‌ బ్యాడ్మింటన్‌ లీగ్‌ (పీబీఎల్‌)లో మాజీ ఛాంపియన్‌ చెన్నై స్మాషర్స్‌ ఘనంగా బోణీ చేసి.. ఏకపక్ష విజయాన్ని సాధించింది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో చెన్నై స్మాషర్స్‌ 6-(-1)తో అహ్మదాబాద్‌ స్మాష్‌ మాస్టర్స్‌ను చిత్తు చేసింది. ట్రంప్‌ మ్యాచ్‌గా ఎంచుకున్న పురుషుల సింగిల్స్‌లో అహ్మదాబాద్‌ కెప్టెన్‌ విక్టర్‌ అక్సెల్‌సెన్‌కు రాజీవ్‌ ఓసెఫ్‌ షాకివ్వగా.. చెన్నై ట్రంప్‌ మ్యాచ్‌లో సంగ్‌ జీ హ్యూన్‌ నెగ్గింది. అక్సెల్‌సెన్‌ ఓటమితో అహ్మదాబాద్‌కు అవకాశాలు లేకుండా పోయాయి. దీంతో మిగిలిన మ్యాచ్‌లనూ నెగ్గి చెన్నై క్లీన్‌ స్వీ‌ప్ చేసింది.

పురుషుల సింగిల్స్‌గా జరిగిన తొలి మ్యాచ్‌లో చోంగ్‌ వి ఫెంగ్‌ 8-15, 15-14, 15-9తో సౌరభ్‌పై గెలిచి చెన్నైకి శుభారంభం అందించాడు. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో క్రిస్‌ అడ్‌కాక్‌-గాబ్రియేలా అడ్‌కాక్‌ ద్వయం 15-14, 15-13తో సాత్విక్‌ సాయిరాజ్‌-సిక్కి రెడ్డి జంటను ఓడించింది.

అహ్మదాబాద్‌ ట్రంప్‌గా ఎంచుకున్న మూడో మ్యాచ్‌లో చెన్నై షట్లర్‌ రాజీవ్‌ ఓసెఫ్‌ 15-12, 7-15, 15-13తో అక్సెల్‌సెన్‌పై గెలిచాడు. దీంతో అహ్మదాబాద్‌కు ఒక పాయింట్‌ కోత ప డింది. చెన్నై ట్రంప్‌గా ఎంచుకున్న మహిళల సింగిల్స్‌లో ఆ జట్టు షట్లర్‌ సంగ్‌ జి హ్యూన్‌ 15-11, 15-9తో గిల్మోర్‌పై నెగ్గి 2పాయింట్లు అందించింది.

మిక్స్‌డ్‌ డబుల్స్‌లో స్మాష్‌ మాస్టర్స్‌ జోడీ సిక్కిరెడ్డి-సాత్విక్‌ 14-15, 13-15తో క్రిస్‌ ఎడ్‌కాక్‌-గాబ్రియెల్‌ చేతిలో ఓడింది. చివరగా జరిగిన పురుషుల డబుల్స్‌లో క్రిస్‌ అడ్‌కాక్‌-సుమీత్‌ రెడ్డి జంట (చెన్నై) 15-11, 15-12తో సాత్విక్‌ సాయిరాజ్‌-రెగినాల్డ్‌ ద్వయంపై నెగ్గింది. హోరాహోరీగా జరిగిన మరో పోరులో బెంగళూరు ర్యాప్టర్స్‌ 4-3తో పుణె 7 ఏసె్‌సపై నెగ్గింది. స్టార్‌ ఆటగాడు కిదాంబి శ్రీకాంత్‌ కీలక సింగిల్స్‌ పోరులో జయరామ్‌ను ఓడించి బెంగళూరుకు విజయాన్ని కట్టబెట్టాడు. సోమవారం జరిగే మ్యాచ్‌లో అవద్‌ వారియర్స్‌తో ముంబై రాకెట్స్‌ తలపడుతుంది.

Story first published: Monday, December 31, 2018, 11:31 [IST]
Other articles published on Dec 31, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+