
హైదరాబాద్: పీబీఎల్‌లో భాగంగా శుక్రవారం జరిగిన గేమ్‌లో ప్రపంచ స్థాయి నంబర్ 10 క్రీడాకారుడైన హెచ్‌ఎస్ ప్రణయ్ చెలరేగాడు. హైదరాబాద్ హంటర్ జట్టు తరపు ఆడుతున్న ప్రత్యర్థి సాయి ప్రణీత్‌ను ఒక్క పాయింట్ తేడాతో ఓడించగలిగాడు. న్యూ ఢిల్లీలోని సిరి ఫోర్ట్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో అహ్మాదాబాద్ 4-3 స్కోరుతో గెలిచింది.
ప్రణయ్ తనదైన శైలిలో ఆడి మొదటి రౌండ్ ముగిసే సరికి 6-2 పాయింట్లతో ఆధిక్యానికి చేరుకున్నాడు. రెండో పాయింట్లోనూ అదే దూకుడుతో 14-10పాయింట్లను రెండో రౌండ్‌లో చేశాడు. సరిగ్గా అదే సమయంలో ప్రణీత్ చేసిన తప్పువల్ల ప్రణయ్ గేమ్ పాయింట్‌ను చేయగలిగాడు. విరామం అనంతరం జరిగిన రెండో భాగంలో 15-11గా స్కోరు ముగిసింది.
ప్రణయ్ ఈ లీగ్‌లో ఆడిన మొదటి మ్యాచ్ కావడంతో అతని మొత్తం స్కోరు 8-15గా ఉంది. దీంతో అతని జట్టుకు 1-4పాయింట్ల స్కోరు మిగిలింది. ఇదే లీగ్‌లో ప్రణయ్‌కి తొమ్మిదో సారి విజయాన్ని చేజిక్కించుకున్నాడు.
అంతకుముందు జరిగిన గేమ్‌లలో అహ్మదాబాద్ స్మాష్ మాస్టర్స్ తరపున ఆడిన టాయ్ జు యింగ్ తన ప్రత్యర్థి అయిన రసిక రాజె మీద గెలిచి మ్యాచ్ కు విజయాన్ని చేకూర్చింది.
Results: 1) XD - of Kamilla Rytter Juhl/Lee Chun Hei bt Satwiksairaj Rankireddy/Pia Zebediah Bernadeth - 4-15, 15-12, 15-8 2) MS - Lee Hyun Il bt Sourabh Verma 15-9,15-11 3) WS - Tai Tzu Ying bt Rasika Raje - 15-5, 15-6 4) MS - H.S Prannoy bt Sai Praneeth - 15-10,15-8 5) MD - Kidambi Nandagopal/Lee Chun Hei Reginald lost to Markis Kido/Ypp Yeon Seong - 15-14, 15-11
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.