Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

డెన్మార్క్ ఓపెన్: హెచ్ఎస్ ప్రణయ్ సంచలన విజయం

హైదరాబాద్: డెన్మార్క్ ఓపెన్ సూపర్ సిరిస్‌లో భారత షట్లర్లు అద్భుత ప్రదర్శన చేస్తున్నారు. మహిళల సింగిల్స్ విభాగంలో సైనా నెహ్వాల్‌ ఇప్పటికే క్వార్టర్స్‌కు దూసుకెళ్లగా, తాజాగా పురుషుల సింగిల్స్ విభాగంలో హెచ్ఎస్ ప్రణయ్, కిదాంబి శ్రీకాంత్ దూసుకెళ్లారు.

గురువారం జరిగిన పోరులో మాజీ వరల్డ్ నెంబర్‌ వన్‌, మూడుసార్లు ఒలింపిక్‌ పతక విజేత, మలేసియా క్రీడాకారుడు లీ చాంగ్‌ వీపై హెచ్‌ఎస్‌ ప్రణయ్‌ సంచలన విజయం నమోదు చేసి క్వార్టర్స్‌కు దూసుకువెళ్లాడు. లీ చాంగ్‌పై ప్రణయ్‌కిది వరుసగా రెండో విజయం కావడం విశేషం.

ఇండోనేసియా ఓపెన్‌లో చాంగ్‌పై ప్రణయ్ విజయం

ఇండోనేసియా ఓపెన్‌లో చాంగ్‌పై ప్రణయ్ విజయం

సరిగ్గా నాలుగు నెలల క్రితం ఇండోనేసియా సూపర్ సిరిస్ ఓపెన్‌లో చాంగ్‌పై ప్రణయ్‌ విజయం సాధించిన సంగతి తెలిసిందే. గంటకుపైగా హోరాహోరీగా జరిగిన పోరులో ప్రణయ్‌ 21-17, 11-21, 21-19తేడాతో లీ చాంగ్‌పై విజయం సాధించాడు. మ్యాచ్ అనంతరం ప్రణయ్ మాట్లాడాడు.

రెండోసారి నెగ్గడం చాలా సంతోషంగా ఉంది

రెండోసారి నెగ్గడం చాలా సంతోషంగా ఉంది

'లీ చాంగ్‌ వీపై వరుసగా రెండోసారి నెగ్గడం చాలా సంతోషంగా ఉంది. ఎలాంటి పరిస్థితుల్లోనైనా రాణించకలిగే సత్తా ఉన్న ప్రపంచ అగ్రశ్రేణి ఆటగాళ్లలో లీ చాంగ్‌ వీ ఒకడు. మ్యాచ్‌కు ముందు ఎవరితో ఆడుతున్నాను అన్న దాని గురించి పెద్దగా ఆలోచించను. టైటిల్‌ గురించి కూడా ఏమాత్రం ఆలోచించడం లేదు. తదుపరి మ్యాచ్‌పైనే నా దృష్టి అంతా' అని ప్రణయ్‌ తెలిపాడు.

8వ సీడ్‌ కిదాంబి శ్రీకాంత్‌ క్వార్టర్స్‌కు

8వ సీడ్‌ కిదాంబి శ్రీకాంత్‌ క్వార్టర్స్‌కు

మరోవైపు అన్‌సీడెడ్‌గా బరిలోకి దిగిన సైనా నెహ్వాల్‌, 8వ సీడ్‌ కిదాంబి శ్రీకాంత్‌ కూడా క్వార్టర్స్‌ చేరుకున్నారు. థాయ్‌లాండ్‌ క్రీడాకారిణి జిందాపాల్‌పై 22-20, 21-13తో సైనా నెహ్వాల్ విజయం సాధించగా... కొరియా క్రీడాకారుడు జియోన్‌ జిన్‌పై 21-13, 8-21, 21-18 తేడాతో కిదాంబి శ్రీకాంత్‌ విజయం సాధించాడు.

ఆరంభంలో కరోలినా మారిన్‌‌కు సైనా షాక్

ఆరంభంలో కరోలినా మారిన్‌‌కు సైనా షాక్

కాగా, డెన్మార్క్ ఓపెన్‌లో అన్‌సీడెడ్‌గా బరిలో దిగిన సైనా నెహ్వాల్ ఒలింపిక్‌ ఛాంపియన్‌, స్పెయిన్‌కు చెందిన కరోలినా మారిన్‌‌కు షాకిచ్చిన సంగతి తెలిసిందే. బుధవారం హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో 22-20, 21-18తో మారిన్‌పై సైనా విజయం సాధించిన సంగతి తెలిసిందే.

Story first published: Tuesday, November 14, 2017, 10:11 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+