న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పీబీఎల్: శ్రీకాంత్, సైనాలు మళ్లీ ఓడిపోయారు

హైదరాబాద్: ప్రపంచ నంబర్‌-10 హెచ్‌.ఎస్‌.ప్రణయ్‌ సంచలనంతో కొత్త ఏడాదిని ఆరంభించాడు. మంగళవారం సొంతగడ్డపై అహ్మదాబాద్ స్మాష్ మాస్టర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్నో 4-3తో ఉత్కంఠ విజయం సాధించింది.

ప్రిమియర్‌ బ్యాడ్మింటన్‌ లీగ్‌ (పీబీఎల్‌)లో ప్రణయ్‌ (అహ్మదాబాద్‌ స్మాష్‌ మాస్టర్స్‌) 15-8, 15-11తో ప్రపంచ నంబర్‌-3 కిదాంబి శ్రీకాంత్‌ (అవధె వారియర్స్‌)కు షాకిచ్చాడు. గత సీజన్‌ నుంచి పీబీఎల్‌లో అజేయంగా ఉన్న ప్రణయ్‌కి టోర్నీలో వరుసగా ఇది పదో విజయం. కాగా శ్రీకాంత్‌కు ఇది వరుసగా రెండో పరాజయం.

వారియర్స్‌తో పోరులో తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓటమితో 0-3తో వెనుకబడ్డ స్మాష్‌ మాస్టర్స్‌.. ప్రణయ్‌ విజయంతో ఆశలను సజీవంగా ఉంచుకుంది. వెంటనే వారియర్స్‌కు మరో దెబ్బ తగిలింది. సైనా నెహ్వాల్‌ 5-15, 14-15తో ప్రపంచ నంబర్‌వన్‌ తై జు యింగ్‌ (స్మాష్‌ మాస్టర్స్‌) చేతిలో ఓడిపోయింది.

ఇది స్మాష్‌ మాస్టర్స్‌కు ట్రంప్‌ మ్యాచ్‌ కావడంతో స్కోరు 3-3తో సమమైంది. హోరాహోరీగా సాగిన ఆఖరి మ్యాచ్‌లో హెండ్రా సెతైవాన్‌, చున్‌ మన్‌ జోడీ నెగ్గడంతో అవధె వారియర్స్‌ జట్టు మ్యాచ్‌లో 4-3తో విజయం సాధించింది. సెతైవాన్‌-చున్‌ మన్‌ జంట 15-14, 15-10తో రెగినాల్డ్‌, నందగోపాల్‌ (స్మాష్‌ మాస్టర్స్‌) ద్వయాన్ని ఓడించింది.

Results
Awadhe Warriors vs Ahmedabad Smash Masters Mixed doubles: Christina Pedersen/Tang Chun Man bt Kamilla Rytter Juhl/Law Cheuk Him 14-15, 15-12, 15-14 Men's singles: Parupalli Kashyap bt Sourabh Verma 11-15, 15-13, 15-14 Men's singles: Kidambi Srikanth lost to HS Prannoy 8-15, 11-15 Women's singles: Saina Nehwal lost to Tai Tzu Ying 5-15, 14-15 Men's doubles: Hendra Setiawan/Tang Chun Man bt Kidambi Nandgopal/Lee Chun Hei Reginald 15-14, 15-10

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Wednesday, January 3, 2018, 11:12 [IST]
Other articles published on Jan 3, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X