
హైదరాబాద్: నిరుపేదలైనా, సంపన్నులైనా క్రీడాకారులు ఆట ఆడలాడేది దేశ ప్రతిష్ఠ కోసమేనంటూ సీనియర్ ఆటగాడైన ప్రకాశ్ పదుకోన్ అన్నారు. లైఫ్ టైమ్ అచీవ్ అవార్డు అందుకున్న ఆనందంలో ఆయన ఇలా ప్రసంగించారు.

దేశ బ్యాడ్మింటన్ రంగానికి చేసిన సేవలకు గుర్తింపుగా దిగ్గజ షట్లర్ ప్రకాశ్ పదుకోన్‌ను భారత బ్యాడ్మింటన్ సమాఖ్య(బాయ్) లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డుతో సత్కరించింది. పలువురు ప్రముఖులు, కుటుంబసభ్యులు పాల్గొన్న కార్యక్రమంలో ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా ప్రకాశ్ అవార్డు స్వీకరించారు.
ఉద్వేగానికి గురైన ప్రకాశ్ కుమార్తె దీపికా పదుకొనె
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ స్థాయికి చేరుకోవడానికి సహకరించిన బాయ్, కర్ణాటక బ్యాడ్మింటన్ అసోసియేషన్, కుటుంబసభ్యులు, స్నేహితులు అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఈ అవార్డును అందరితో కలిసి పంచుకోవాలనుకుంటున్నాను.

ఆటపై ప్రేమతో ఆడాను తప్పా..డబ్బు, అవార్డులు, రివార్డులు ఎప్పుడు ఆలోచించలేదు. దేశంలో బ్యాడ్మింటన్ క్రీడాభివృద్ధిని చూస్తే చాలా సంతోషంగా ఉంది అని ప్రకాశ్ అన్నారు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.