For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

'సైనా సొంత నిర్ణయం అది.. అందులో మా జోక్యం లేదు'

 Prakash Padukone Academy Did Not Force Saina Nehwal To Train Under Vimal Kumar

ముంబై: గోపీచంద్‌ అకాడమీని వీడాలన్న నిర్ణయం సైనా నెహ్వాల్‌ స్వయంగా తీసుకుంది. సైనా నిర్ణయంలో తమ పాత్ర లేదని బ్యాడ్మింటన్‌ దిగ్గజం ప్రకాశ్‌ పదుకొణె బ్యాడ్మింటన్‌ అకాడమీ (పీపీబీఏ) స్పష్టం చేసింది. 2014 ప్రపంచ చాంపియన్‌షిప్‌ తర్వాత గోపీ అకాడమీని వీడిన సైనా.. బెంగళూరులోని ప్రకాశ్‌ పదుకొణె అకాడమీలోని కోచ్‌ విమల్‌ కుమార్‌ వద్ద కొన్నాళ్లు శిక్షణ తీసుకుంది. అకాడమీని వీడేందుకు ప్రకాశ్‌, విమల్‌, విరెన్‌ రస్కిర్హాయే సైనాను ప్రోత్సహించారని గోపీచంద్‌ అన్న సంగతి తెలిసిందే.

త్వరలో విడుదల కానున్న తన బయోగ్రఫీ 'డ్రీమ్స్‌ ఆఫ్‌ ఏ బిలియన్‌: ఇండియా అండ్‌ ద ఒలింపిక్‌ గేమ్స్‌' పుస్తకంలో 'బిట్టర్‌ రైవల్‌రీ' అనే అధ్యాయంలో గోపీచంద్‌ ఈ విషయం గురించి వెల్లడించారు. గోపీ వ్యాఖ్యలపై పదుకొణె అకాడమీ స్పందించింది. 'బెంగళూరులో పీపీబీఏ కేంద్రంలో శిక్షణ తీసుకోవాలన్న సైనా నిర్ణయంలో మా పాత్ర లేదు. ఫామ్‌ కోల్పోయి కష్టాల్లో పడ్డ సైనాకు విమల్‌ సాయం చేశారు. అతని ఆధ్వర్యంలోనే సైనా వరల్డ్‌ నెంబర్‌వన్‌ ర్యాంక్‌తో పాటు ప్రపంచ చాంపియన్‌షిప్లో రజత పతకం సాధించింది' అని తెలిపింది.

ప్రకాశ్‌ సర్‌ తన గురించి ఆమెకు సానుకూలంగా చెప్పలేదన్న వ్యాఖ్యలపైనా కూడా పదుకొణె అకాడమీ వివరణ ఇచ్చింది. 'ఆటగాడిగా, కోచ్‌గా భారత బ్యాడ్మింటన్‌కు ఎంతో సేవ చేసిన గోపీచంద్‌పై పీపీబీఏకు చాలా గౌరవం ఉంది. అంతర్జాతీయ స్థాయిలో అతడు సాధించిన విజయాలకు మేం గర్విస్తున్నాం. అతడితో అప్పుడూ సత్సంబంధాలనే కొనసాగించాం. మా అకాడమీ నుంచి ఎంతో మంది షట్లర్లు ఎదిగారు. వారి ఎదుగుదలను అడ్డుకొనే విధానమేమీ మాకు లేదు' అని తెలిపింది.

'2014లో సైనా అకాడమీని వీడుతుంటే.. అత్యంత సన్నిహితమైన వ్యక్తి దూరమైనట్టు అనిపించింది. వెళ్లొద్దని అంతకుముందే చాలా బతిమిలాడా. ఇతరుల ప్రభావంతో ఆమె అప్పటికే వెళ్లడానికి సిద్దమయింది. ఇక నేను ఆపలేకపోయా. తను వెళ్లడం ఇద్దరికీ మంచిది కాదని తెలుసు. ఆ సమయంలో వేరే క్రీడాకారులను చూసుకోవాల్సిన బాధ్యత నాపై ఉండేది. పీవీ సింధు 2012- 2014 కాలంలో అత్యుత్తమంగా రాణించింది. అయినా.. ఎప్పుడూ సైనా నెహ్వాల్‌ను విస్మరించలేదు' అని గోపిచంద్‌ ఇదివరకు అన్నారు.

'నా రోల్‌ మోడల్‌ అయిన ప్రకాశ్‌ సర్‌ను ఎంతగానో అభిమానిస్తాను. అతను సైనాతో మాట్లాడాల్సింది. వాళ్లెందుకు మాట్లాడుకోలేదో నాకు తెలీదు. సైనాని హైదరాబాద్‌ వీడమని బలవంతం చేశారు. ప్రకాశ్‌ సర్‌ నా గురించి ఎందుకు తనతో చర్చించలేదో ఇప్పటికీ అర్థం
కావడంలేదు. ప్రకాశ్‌ సర్‌ను ఎంతగానో అభిమానిస్తాను. కానీ ఆయన మాత్రం బ్యాడ్మింటన్‌కు ఇంతచేసినా నా సేవల గురించి ఎక్కడా, ఎప్పుడూ ఒక్క మంచి మాటగానీ చెప్పలేదు. ప్రశంసలుగానీ కురిపించలేదు' అని గోపీ చెప్పుకొచ్చారు.

Story first published: Wednesday, January 15, 2020, 9:53 [IST]
Other articles published on Jan 15, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+