For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మోడీ సార్ మిమ్మల్ని మిస్సవుతున్నా!: పారా అథ్లెట్లకు భారీ నజారానా!

PM Modi congratulates Para-Badminton medallists after bronze-medal winner Sukant Kadam tweets

హైదరాబాద్: స్విట్లర్లాండ్‌లోని బాసెల్ వేదికగా జరిగిన వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం సాధించి భారత బ్యాడ్మింటన్‌ కీర్తిని ప్రపంచ వ్యాప్తం చేసిన పీవీ సింధుకు భారతావని మొత్తం నీరాజనాలు పలుకుతుంటే... అదే వేదికగా జరిగిన పారా బ్యాడ్మింటన్ టోర్నీలో భారత ప్లేయర్లు సైతం పతకాల పంట పండించారు.

ఇదే ఈవెంట్‌లో పాల్గొన్న భారత పారా బ్యాడ్మింటన్‌ ప్లేయర్లు మొత్తం 12 పతకాలను సాధించారు. 2015 తర్వాత ఇంత మొత్తం భారత పారా అథ్లెట్లు పతకాలు సాధించడం ఇదే తొలిసారి. ఈ టోర్నీలో భారత్ మొత్తం మూడు స్వర్ణాలు సాధించడం విశేషం. అయితే, పారా బ్యాడ్మింటన్ టోర్నీలో పతకాలు నెగ్గిన అథ్లెట్లను ప్రధాని మోడీ ట్విట్టర్‌లో అభినందలేదు.

మోడీ గారి రెస్పాన్స్ కోసం

ఈ క్రమంలో ఈ పార్ బ్యాడ్మింటన్ టోర్నీలో పతకం నెగ్గిన సుకంత్ కదమ్ తన ట్విట్టర్‌లో "నేను ప్రధాని మోడీ గారి రెస్పాన్స్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఆసియా పారా గేమ్స్‌ తర్వాత మిమ్మల్ని కలిసే అవకాసాన్ని నేను మిస్సయ్యా. ఇప్పుడు డెన్మార్క్ టోర్నమెంట్‌కు వెళ్లా. డెన్మార్క్ టోర్నీలో నేను పతకం సాధించినా మిమ్మల్ని కలిసే అవకాశాన్ని మిస్సయ్యా" అని ట్వీట్ చేశాడు.

ఆటగాళ్లపై ప్రశంసల వర్షం

కాగా, సుకంత్ కదమ్ ట్వీట్ చేసిన కొన్ని గంటలకే ప్రధాని నరేంద్ర మోడీ పారా బ్యాడ్మింటన్ టోర్నీలో పతకాలు సాధించిన ఆటగాళ్లపై ప్రశంసల వర్షం కురిపించారు. "వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో 12 పతకాలు సాధించిన పారా బ్యాడ్మింటన్ ఆటగాళ్ల పట్ల 130 కోట్ల మంది భారతీయులు గర్వంగా ఉన్నారు. టీమ్ మొత్తానికి అభినందనలు. మీ విజయం మా అందరినీ ఉత్సాహపరిచింది" అంటీ ట్వీట్ చేశారు.

కేంద్ర క్రీడల మంత్రిని కలిసి అథ్లెట్లు

అంతకు ముందు ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్న పారా బ్యాడ్మింటన్ అథ్లెట్లకు కూడా ఘన స్వాగతం లభించింది. అనంతరం ఈ టోర్నీలో పతకాలు సాధించిన షట్లర్లు కేంద్ర క్రీడాశాఖ మంత్రి కిరణ్ రిజుజుని సోమవారం కలిశారు. పురుషుల సింగిల్స్ విభాగంలో స్వర్ణం సాధించి ప్రమోద్ భగత్‌కు, మహిళల సింగిల్స్ విభాగంలో స్వర్ణం సాధించి మానసి జోషిలకు రిజుజు రూ.20 లక్షల నగదు బహుమానం అందించారు.

భారీ బహుమానం అందించిన కేంద్ర ప్రభుత్వం

ఇక రజతం సాధించిన వారికి రూ.14 లక్షలు, కాంస్యం సాధించిన వారికి రూ.10.50 లక్షలు అందించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఆయన సోషల్‌మీడియా ద్వారా పంచుకున్నారు. పారా బ్యాడ్మింటన్ షట్లర్లను సన్మానించడం ఎంతో సంతోషంగా ఉందని.. ఈ ఆనందానికి అవధులు లేవని రిజుజు పేర్కొన్నారు.

Story first published: Wednesday, August 28, 2019, 12:56 [IST]
Other articles published on Aug 28, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+