టెన్షన్: సింధు తల్లిలో ఆశానిరాశల దోబుచులాట (పిక్చర్స్)
హైదరాబాద్: కరోలినా మారిన్‌ను రియో ఒలింపిక్స్ ఫైనల్ మ్యాచులో పివి సంధు తలపడుతున్న సమయంలో హైదరాబాదులోని గోపిచంద్ అకాడమీ క్రిక్కిరిసిపోయింది. ఆమె మ్యాచును చూడడానికి ప్రముఖులు, తల్లిదండ్రులు, అభిమానులు పెద్ద యెత్తున శుక్రవారం సాయంత్రం తరలి వచ్చారు.
సింధు విజయాన్ని ఆకాంక్షిస్తూ జాతీయ పతాకను రెపరెపలాడించారు. ఆశానిరాశల మధ్య కొట్టుమిట్టాడుతూ వచ్చారు. చివరి వరకు సింధు మారిన్‌పై తలపడిన ఆట మరువరానిదిగా మిగిలిపోతుంది. తొలి సెట్‌లో గెలిచిన సింధు ఫైనల్ విజయంపై ఆశలు నింపింది.
సింధును ఎదుర్కోవడం అంత సులభం కాదని గ్రహించిన ప్రపంచ నెంబర్ వన్ కరోలినా మారిన్ వ్యూహాన్ని మార్చింది. సింధును ఓడించడానికి మైదానంలో చురుకుగా కదులుతూ వచ్చింది. రెండో సెట్‌లో విజయం సాధించిన మారిన్ మూడో సెట్‌లో హోరాహోరీ పోరాడాల్సి వచ్చింది. దీంతో మ్యాచ్ యావత్తు ఉత్కంఠభరితంగా సాగింది.

సింధు విజయం కోసం...
ఫైనల్లో సింధు విజయం కోసం గోపీచంద్ అకాడమీ వద్ద పాఠశాల పిల్లలు జాతీయ పతాకలను ఎగురేస్తూ కేరింతలు కొడుతూ వచ్చారు.

ఉత్కంఠతో పురంధేశ్వరి...
కేంద్ర మాజీ మంత్రి, బిజెపి నాయకురాలు దగ్గుబాటి పురంధేశ్వరి మ్యాచ్ ప్రారంభానికి ముందే అకాడమీకి వచ్చి, మ్యాచును ఉత్కంఠతో తిలకించారు.

పురంధేశ్వరి ఇలా..
సింధు ప్యాంట్ కోల్పోయినప్పుడు పురంధేశ్వరి హావభావాలు ఇలా ఉన్నాయి. మిగతా ప్రేక్షకులు అయ్యో అన్నట్లు ఇలా కనిపించారు.

ఇలా పిల్లలు..
సింధు కరోలినా మారన్‌తో తలపడుతున్నప్పుడు పిల్లలు అత్యంత ఆసక్తిగా తిలకిస్తూ వచ్చారు. వారి హావభావాలు ఇలా..

అయ్యో.. అక్కా....
సింధు పాయింట్ కోల్పోయినప్పుడు పిల్లలు ఇలా నిరాశకు గురైనట్లు కనిపిస్తున్నారు. అయ్యో.. అక్కా.. ఎంత పనిచేశావన్నారా...

పాయింట్ సాధించిప్పుడు..
సింధు పాయింట్ సాధించనప్పుడు ఇలా హర్షధ్వానాలు చేశారు. సింధు తల్లి ముఖంలో తీవ్రమైన ఉత్కంఠ ఛాయలు స్పష్టంగా కనిపించాయి.

జెండా ఊంఛే రహే హమారా...
సింధు ప్రతి పాయింట్‌కు గోపిచంద్ అకాడమీ హర్షధ్వానాలు చేశారు. జాతీయ జెండాను ఎగురేస్తూ సింధుకు గో ఎహెడ్ అనే సందేశం ఇచ్చారు.

ఈ పాప ఇలా..
సింధు పాయింట్ కోల్పోయినప్పుడు తానే కోల్పోయినట్లుగా ఈ పాప ముఖంలో విషాదం స్పష్టంగా చూడవచ్చు. తీవ్రమైన ఉత్కంఠతో మ్యాచును తిలకిస్తున్న దృశ్యం..

అమ్మాయిలకు ఐకాన్...
పివి సింధు ఇప్పుడు అమ్మాయిల ఆశాజ్యోతి.. వారికి ఐకాన్... సింధు రియో ఒలింపిక్స్‌లో భారత కీర్తిని నిలబెడుతుంటే అమ్మాయిలు ఇలా...

సింధు తల్లి ఇలా...
సింధు కరోలినాను ముప్పు తిప్పలు పెడుతుంటే ఆమె తల్లి విజయలక్ష్మి ఇలా ఆనందంగా పోయింట్ సాధించినప్పుడు కనిపించింది.

ఇలా నిరాశ....
కరోలినా మారిన్ చేతిలో సింధు ఓడిపోయినప్పుడు ఆమె తల్లి విజయలక్ష్మి ముఖంలో నిరాశ స్పష్టంగా కనిపించింది. ఇలా కనిపించింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications