శ్రీకాంత్ డాన్‌ను ఓడించి ఇలా, ఊహించలేదని (పిక్చర్స్)
హైదరాబాద్: చైనా ఓపెన్ టైటిల్‌ను యువ షట్లర్ కిడాంబి శ్రీకాంత్ తన తల్లిదండ్రులు, కోచ్ పుల్లెల గోపీచంద్‌కు అంకితమిచ్చాడు. ఈ టైటిల్ నెగ్గి చరిత్ర సృష్టించిన కిడాంబి శ్రీకాంత్‌కు సోమవారం తెల్లవారుజామున శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నాడు.
ఈ సందర్భంగా కోచ్‌లు, మిత్రులు, గోపీచంద్ అకాడమీ ప్రతినిధులు శ్రీకాంత్‌కు ఘన స్వాగతం పలికారు. ఫైనల్లో ఐదుసార్లు ప్రపంచ చాంపియన్ లిన్ డాన్ (చైనా)ను 21 ఏళ్ల శ్రీకాంత్ చిత్తు చేసిన సంగతి తెలిసిందే. పురుషుల విభాగంలో సూపర్ సిరీస్ టైటిల్ నెగ్గిన తొలి భారత షట్లర్‌గా కిడాంబి నిలిచాడు. డాన్‌ను ఓడిస్తానని ఊహించలేదని శ్రీకాంత్ తెలిపాడు.
సూపర్ సిరీస్ ప్రీమియర్ టైటిల్ గెలిచిన తొలి భారతీయుడిగా శ్రీకాంత్ రికార్డు సృష్టించాడు. రెండు సార్లు ఓలింపిక్ టైటిల్, ఐదు సార్లు ప్రపంచ చాంపియన్‌షిప్ గెలుచుకున్న డాన్‌ను శ్రీకాంత్ ఓడించాడు. నవంబర్ 16వ తేదీన శ్రీకాంత్ ఆ ఘనత సాధించాడు.

విమానాశ్రయంలో శ్రీకాంత్
చైనా ఓపెన్ టైటిల్ గెలుచుకుని కిడాంబి శ్రీకాంత్ చరిత్ర సృష్టించాడు. ఆయన సోమవారం హైదరాబాద్ వచ్చాడు. శంషాబాద్ విమానాశ్రయంలో ఇలా..

ఈ ఆనందం చెప్పేదేనా..
ఈ ఆనందం మాటలకు దొరకదంటూ శ్రీకాంత్‌ను ఇలా ఆహ్వానిస్తూ... శంషాబాద్ విమానాశ్రయం ఇలా పులకించిపోయింది.

శ్రీకాంత్ చిరునవ్వులు...
తనకు లభించిన స్వాగతానికి కిడాంబి శ్రీకాంత్ ఆనందంతో ఇలా కనిపించాడు. అతను డాన్‌ను ఓడించి చరిత్ర సృష్టించాడు.

శ్రీకాంత్‌కు అభినందన..
శంషాబాద్ విమానాశ్రయానికి సోమవారం ఉదయం చేరుకున్న కిడాంబి శ్రీకాంత్‌కు సాదర స్వాగతం లభించింది.

ఆనందం ఇలా..
చరిత్ర సృష్టించి వచ్చిన కిడాంబి శ్రీకాంత్ తన తల్లిదండ్రులతో శంషాబాద్ విమానాశ్రంయలో ఇలా కనపించాడు.

ఆనందం ఆకాశమై..
హైదరాబాద్‌లోని శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చిన కిడాంబి శ్రీకాంత్‌కు సాదర స్వాగతం లభించింది. అతని ఆనందానికి అవధులు లేవు.

ఆనందాన్ని పంచుకుంటూ..
హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయంలో అడుగు పెట్టిన కిడాంబి శ్రీకాంత్‌కు సాదర స్వాగతం లభించింది. తన ఆనందాన్ని ఇలా కరచాలనాలతో పంచుకుంటూ..

అభినందన ఇలా..
శిష్యుడు విజయుడై వస్తే గురువుకు ఎంత ఆనందంగా ఉంటుందో చెప్పలేం. తన విజయాన్ని తన గురువు గోపీచంద్‌కు, తల్లిదండ్రులకు శ్రీకాంత్ అంకితమిచ్చాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications