
తొలి సెట్‌ను 12-10తో కైవసం చేసుకున్న సింధు
తొలి గేమ్ మొదట్లో వెనుకబడ్డ సింధు ఆ తర్వాత కసిగా పుంజుకుని వరుస పాయింట్లు కొల్లగొట్టింది. పదునైన స్మాష్‌లకు తోడు డ్రాప్ షాట్లు, నెట్‌గేమ్‌తో ప్రత్యర్థిని చిత్తు చేసింది. అయితే చెంగ్ గాన్ యీ కూడా ధీటుగా ఆడటంతో గేమ్ హోరాహోరీగా సాగింది. చివరకు తొలి సెట్‌ను 12-10తో సింధు కైవసం చేసుకుంది.

రెండో గేమ్‌లో సింధు దూకుడు
ఇక రెండో గేమ్‌లో సింధు పూర్తిగా తన దూకుడుని ప్రదర్శించింది. చెంగ్ గేమ్‌పై ఓ అవగాహనకు వచ్చిన సింధు ఆమె బలహీనతలను సొమ్ముచేసుకుంటూ అలవోకగా పాయింట్లు దక్కించుకుంది. ఇలా 11-6తో రెండో గేమ్‌ను దక్కించుకున్న సింధు చెన్నైకి విజయాన్ని అందించింది.

అశ్వినీ పొన్నప్ప, యిహాన్ సంగ్‌పై విజయం
ఆ తర్వాత జరిగిన మిక్స్‌డ్ డబుల్స్‌లో పోరులో చెన్నై ద్వయం గాబ్రియెల్ అడ్‌కాక్, క్రిస్ అడ్‌కాక్ 11-6, 8-11, 15-14తో అశ్వినీ పొన్నప్ప, యిహాన్ సంగ్‌పై విజయం సాధించింది. దాంతో చెన్నై స్మాషర్స్ ఆధిక్యం 3-0కు పెరిగింది. మరో పురుషుల సింగిల్స్ మ్యాచ్‌లో బెంగళూరు ప్లేయర్ విక్టర్ అక్సెల్‌సన్ 11-7, 13-11 టామీ సుగియార్తిపై విజయం సాధించాడు.

క్రిస్ అడ్‌కాక్, మ్యాడ్స్ పీలర్ చేతిలో పరాజయం
అయితే ఈ మ్యాచ్ ద్వారా సాధించిన ఒక పాయింట్‌ను కూడా బ్లాస్టర్స్ ఆ తర్వాత కోల్పోయింది. చివరగా జరిగిన పురుషుల డబుల్స్‌లో ఆ టీమ్ ‘ట్రంప్'గా బరిలోకి దిగిన సుంగ్ హున్ కో, యూ యోన్ తీవ్రంగా పోరాడినా చివరకు 7-11, 11-7, 11-13 స్కోరుతో క్రిస్ అడ్‌కాక్, మ్యాడ్స్ పీలర్ చేతిలో పరాజయం పాలయ్యారు.

పీబీఎల్ మ్యాచ్‌కి భార్యతో వచ్చిన సచిన్
రెండో పురుషుల సింగిల్స్ మ్యాచ్ మినహా మిగతా నాలుగు మ్యాచ్‌లను ఆ జట్టు సొంతం చేసుకుంది. ఈ సీజన్‌లో చెన్నైకి ఇదే తొలి విజయం. బుధవారం జరిగే మ్యాచ్‌లో హైదరాబాద్ హంటర్స్‌తో ముంబై రాకెట్స్ ఆడుతుంది. ముంబైలో జరిగిన ఈ మ్యాచ్‌లకు క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ తన భార్య అంజలితో కలిసి హాజరయ్యారు.


Click it and Unblock the Notifications











