సింధు ఓడినా.. వరుసగా రెండో విజయాన్నందుకున్న హైదరాబాద్ హంటర్స్

హైదరాబాద్: డిఫెండింగ్ ఛాంపియన్ హైదరాబాద్ హంటర్స్ జట్టు ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్(పీబీఎల్)లో వరుసగా రెండో విజయం సాధించింది. మంగళవారం హైదరాబాద్, గచ్చిబౌలిలోని ఇండోర్ స్టేడియంలో జరిగిన రెండో మ్యాచ్‌లో చెన్నై స్మాషర్స్‌ను 5-0తో ఓడించింది. స్టార్ షట్లర్ పి.వి.సింధు ఓడినా.. హైదరాబాద్ హంటర్స్ నిలిచింది. తొలిమ్యాచ్‌లో కరోలినా మారిన్‌ను ఓడించిన పీవీ సింధుకు ఈ మ్యాచ్‌లో సంగ్ జి హున్ షాకిచ్చింది. తొలుత పురుషుల డబుల్స్ మ్యాచ్‌ను ట్రంప్ మ్యాచ్‌గా హంటర్స్ జట్టు ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో కిమ్ సా రంగ్, బోడిన్ ఇసారా జోడీ 13-15, 15-12, 15-10స్కోరుతో చెన్నై జోడీ సుమిత్‌రెడ్డి, చిన్ చుంగ్ జోడీపై హోరాహోరీగా పోరాడి గెలిచింది.

హైదరాబాద్ హంటర్స్ శుభారంభం
దీంతో జట్టు ఖాతాలో హంటర్స్ జట్టు ఖాతాలో రెండు పాయింట్లు చేరాయి. తొలుత హంటర్స్ జోడీ 4-10 తేడాతో వెనుకబడినా అనూహ్య పోరాటంతో పాయింట్ల అంతరాన్ని తగ్గించినా తొలిగేమ్ చేజార్చుకుంది. అనంతరం రెండు, మూడో గేమ్‌లను దక్కించుకుని జట్టుకు ఆధిక్యాన్ని అందించింది. పురుషుల సింగిల్స్‌లో లీ హ్యూన్ 15-11, 15-13తో చెంగ్ వీయ్ ఫెంగ్‌ను ఓడించడంతో హంటర్స్ ఆధిక్యం రెట్టింపైంది.

పీవి సింధు తడబడినా
ఆ తర్వాత మహిళల సింగిల్స్‌లో హైదరాబాద్‌కు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు సూపర్‌స్టార్ పీవి సింధు 13-15, 15-14, 7-15తో సంగ్ హ్యున్ చేతిలో అనూహ్యంగా ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో అంత సౌకర్యంగా కనిపించని సింధు పదేపదే అనవసర తప్పిదాలతో పాయింట్లు చేజార్చుకుంది. రెండోగేమ్ గెలిచినా..మూడో గేమ్‌లో మాత్రం సంగ్ జోరుకు పూర్తిగా చేతులెత్తేసింది. దీంతో 15-14తో గెలిచిన సింధుకు మూడో గేమ్‌లో సంగ్ హ్యూన్ అవకాశమే ఇవ్వలేదు. దీంతో స్కోరు 3-1గా మారింది.

చెన్నై ఆశలకు తెర దించుతూ
మ్యాచ్‌లో కశ్యప్ విజయంతో పాయింట్లు సమం చేయాలనుకున్న చెన్నై ఆశలకు తెర దించుతూ 15-11, 14-15, 15-13స్కోరుతో మార్క్ విజయం సాధించి జట్టుకు 4-0 ఆధిక్యం అందించాడు. తొలి గేమ్ కోల్పోయి.. రెండో గేమ్‌లో గొప్పగా పుంజుకున్న కశ్యప్.. మూడో గేమ్‌లో ఒక దశలో ఆధిక్యంలో ఉండి కూడా ఓటమి చవిచూశాడు. మిక్స్‌డ్ డబుల్స్‌లో సారంగ్-వోన్ 14-15, 15-13, 15-14తో క్రిస్ అడ్‌కాక్-గాబి అడ్‌కాక్‌పై గెలిచారు.

హంటర్స్ సీజన్-4లో వరుసగా రెండో విజయం
కశ్యప్ ఓటమితో చెన్నై జట్టు సాధించిన పాయింట్‌ను నష్టపోగా.. చివరి మిక్స్‌డ్ డబుల్స్‌లోనూ హంటర్స్ జంట సారంగ్ కిమ్, హై వోన్ జోడీ 15-11, 14-15, 15-13స్కోరుతో చెన్నై జోడీ క్రిస్ ఆడ్‌కక్, గాబ్రియెల్‌ను ఓడించింది. దీంతో 5-0తో హైదరాబాద్ హంటర్స్ సీజన్-4లో వరుసగా రెండో విజయం అందుకుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications