For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సింధుకు బీవెన్‌ షాక్‌: హైదరాబాద్‌ హంటర్స్‌కు తొలి ఓటమి

PBL: Beiwen Zhang beats PV Sindhu in straight games as Awadhe Warriors defeat Hyderabad Hunters

హైదరాబాద్: ప్రిమియర్‌ బ్యాడ్మింటన్‌ లీగ్‌ నాలుగో సీజన్‌లో సొంతగడ్డపై పీవీ సింధు సారథ్యంలోని హైదరాబాద్‌ హంటర్స్‌కు తొలి ఓటమి ఎదురైంది. శుక్రవారం గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్‌ హంటర్స్‌ 1-4 తేడాతో అవధె వారియర్స్‌ చేతిలో పరాజయం పాలైంది.

మహిళల సింగిల్స్‌‌లో పీవీ సింధు 13--15, 8-15తో ప్రపంచ పదో ర్యాంకర్‌ బీవెన్‌ జాంగ్‌ చేతిలో ఓడిపోవడం గమనార్హం. అంతకుముందు హంటర్స్‌కు ఆశించిన ఆరంభం దక్కలేదు. ఆ జట్టు ట్రంప్‌ మ్యాచ్‌గా ఎంచుకున్న మిక్స్‌డ్‌ డబుల్స్‌ మ్యాచ్‌లో కిమ్‌-హ్యూ వాన్‌ జోడీ 12-15, 15-9, 11-15తో క్రిస్టియాన్సెన్‌-అశ్విని పొన్నప్ప చేతిలో ఓటమి పాలైంది.

ఫలితంగా అవధె వారియర్స్‌ 2-0 ఆధిక్యానికి దూసుకుపోయింది. ఇక, పురుషుల సింగిల్స్‌ మ్యాచ్‌లో కల్‌జోవ్‌ 10-15, 15-7, 15-7తో డాంగ్‌ లీపై గెలిచి హైదరాబాద్‌లో ఆనందాన్ని నింపాడు. అవధె ట్రంప్‌ మ్యాచ్‌గా ఎన్నుకున్న పురుషుల సింగిల్స్‌ మ్యాచ్‌లో సన్‌ వాన్‌ హో 15-10, 11-15తో హ్యూన్‌ లీపై గెలుపొందడంతో ఆ జట్టు 4-0తో ఆధిక్యంలో నిలిచింది.

PBL: Beiwen Zhang beats PV Sindhu in straight games as Awadhe Warriors defeat Hyderabad Hunters

చివరగా జరిగిన పురుషుల డబుల్స్‌ మ్యాచ్‌లో హంటర్స్‌ జోడీ యాంగ్‌ లీ- క్రిస్టియాన్సెన్‌ 15-9, 15-13తో ఇసార-కిమ్‌పై నెగ్గింది. అంతకుముందు బెంగళూరు రాప్టర్స్‌ 3-4తో అహ్మదాబాద్‌ స్మాష్‌ మాస్టర్స్‌ చేతిలో ఓడింది. మిక్స్‌డ్‌, పురుషుల సింగిల్స్‌, మహిళల సింగిల్స్‌ల్లో అహ్మదాబాద్‌ గెలవగా... మహిళల సింగిల్స్‌, పురుషుల సింగిల్స్‌, డబుల్స్‌లో బెంగళూరు నెగ్గింది.

అహ్మదాబాద్‌ ట్రంప్‌ మ్యాచ్‌గా ఎంచుకొన్న మిక్స్‌డ్‌ డబుల్స్‌ మ్యాచ్‌లో సాత్విక్‌- సిక్కిరెడ్డి జోడీ 13-15, 15-11, 15-14తో మార్కస్‌- స్మిత్‌ జంటపై నెగ్గగా.. పురుషుల సింగిల్స్‌లో సౌరభ్‌ వర్మ 15-11, 11-15, 15-14తో సాయిప్రణీత్‌పై నెగ్గి ఆధిక్యాన్ని రెట్టింపు చేశాడు. మరో సింగిల్స్‌లో బెంగళూరు కెప్టెన్‌ కిదాంబి శ్రీకాంత్‌ 15-9, 6-15, 15-11తో డారెన్‌పై విజయం సాధించాడు.

పురుషుల డబుల్స్‌ మ్యాచ్‌లో బెంగళూరు జోడీ అసాన్‌- సెటియవాన్‌ 15-13, 15-9తో నందగోపాల్‌-చున్‌ లీపై నెగ్గడంతో స్కోరు 3-3తో సమమైంది. నిర్ణయాత్మక మహిళల సింగిల్స్‌ మ్యాచ్‌లో గిల్మోర్‌ 15-8, 15-13తో తరంగ్‌పై గెలిచి అహ్మదాబాద్‌ జట్టుకు విజయంతో పాటు ఆధిక్యాన్ని అందించింది.

పీబీఎల్‌లో శనివారం
పుణె Vs ముంబై (సాయంత్రం 4 నుంచి)
నార్త్‌ ఈస్టర్న్‌ Vs ఢిల్లీ (రాత్రి 7 నుంచి)

Story first published: Saturday, December 29, 2018, 11:11 [IST]
Other articles published on Dec 29, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+