ఒక్కో ఫ్రాంచైజీ గరిష్టంగా రూ.2.12 కోట్లు
ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన 10 మంది, ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో పతకాలు గెలిచిన 8 మంది వేలం పాటలో బరిలో ఉన్నారు. వేలం పాటలో ఒక్కో ఫ్రాంచైజీ గరిష్టంగా రూ.2.12 కోట్లు ఖర్చు చేయొచ్చు. ఒక్కో క్రీడాకారుడిపై గరిష్టంగా రూ.72 లక్షలు వెచ్చించొచ్చు.

పీవీ సింధుని అట్టిపెట్టుకున్న చెన్నై స్మాషర్స్ జట్టు
వేలంలో భాగంగా ఒక్కో జట్టుకి ఒక ప్లేయర్‌ని అట్టిపెట్టుకునే అవకాశం వేలం నిర్వాహకులు సూచించారు. దీంతో చెన్నై స్మాషర్స్ జట్టు పీవీ సింధుని అట్టిపెట్టుకోగా... రియో ఒలింపిక్స్ విజేత, స్పెయిన్ క్రీడాకారిణి కరోలినా మారిన్‌ని హైదరాబాద్ హంటర్స్ ఫ్రాంఛైజీ రూ.50 లక్షలు వెచ్చించి దక్కించుకుంది.
సైనా నెహ్వాల్‌ని అంటిపెట్టుకున్న అవధె వారియర్స్
ఇక, అవధె వారియర్స్ ఫ్రాంఛైజీ సైనా నెహ్వాల్‌ని, బెంగళూరు బ్లాస్టర్స్ సిక్కిరెడ్డిని అట్టిపెట్టుకోగా.. భారత డబుల్స్ క్రీడాకారిణి అశ్విన్ పొన్నప్పని రూ. 20లక్షలకి, ప్రణవ్‌ని రూ.18 లక్షలకి ఢిల్లీ ఏసర్స్ దక్కించుకుంది. రూ.52 లక్షలతో మహిళల సింగిల్స్ నెంబర్‌వన్ క్రీడాకారిణి తై జు యింగ్‌ను అహ్మదాబాద్ స్మాష్ మాస్టర్స్ కైవసం చేసుకుంది.
డిసెంబరు 22 నుంచి జనవరి 14 వరకు టోర్నీ
డిసెంబరు 22 నుంచి జనవరి 14 వరకు పీబీఎల్ మూడో సీజన్ పోటీలు జరగనున్నాయి. ఈ పోటీలకు ముంబై, హైదరాబాద్, లక్నో, చెన్నై, గౌహతి ఆతిథ్యమివ్వనున్నాయి. ఇక, ప్రైజ్‌మనీ విషయానికి వస్తే మొత్తం రూ.6 కోట్లు (విజేతకు రూ.3 కోట్లు, రన్నరప్‌కు రూ.1.5 కోట్లు, 3-4 స్థానాల్లో నిలిచే జట్లకు రూ.75 లక్షలు చొప్పున).


Click it and Unblock the Notifications











