PBL Auction: సింధుకే అగ్రతాంబూలం, తైజు కోసం పోటీపడిన పుణె-బెంగళూరు

న్యూఢిల్లీ: ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్) వేలంలో ప్రపంచ ఛాంపియన్ పీవీ సింధు అత్యధిక ధర పలికింది. ఐదో సీజన్ కోసం మంగళవారం జరిగిన వేలంలో హైదరాబాద్ హంటర్స్ గరిష్ఠ మొత్తమైన రూ. 77 లక్షలతో సింధును అట్టిపెట్టుకుంది. పీబీఎల్ నిబంధనల ప్రకారం గత సీజన్‌లో ఒక ప్లేయర్‌కు గరిష్ఠంగా రూ. 70 లక్షలు చెల్లించారు.
అయితే, ఈ ఏడాది వారిని కొనసాగించాలంటే రూ. 70 లక్షలు గానీ లేదంటే అదనంగా 10 శాతం మించకుండా చెల్లించే వెలులుబాటుని కల్పించారు. దీంతో హంటర్స్ రూ. 77 లక్షలతో సింధును సొంతం చేసుకుంది. ఇక, ప్రపంచ నెంబర్‌వన్ తై జు యింగ్ కోసం పుణె 7 ఏసెస్ నుంచి డిఫెండింగ్ చాంపియన్ బెంగళూరు రాప్టర్స్ గట్టి పోటీ ఎదుర్కోవాల్సి వచ్చింది.
రెండు జట్లూ రూ.77 లక్షలు చెల్లించేందుకు సిద్ధమవగా, లాటరీ ద్వారా బెంగళూరును అదృష్టం వరించింది. గత సీజన్‌లో తై జు యింగ్ అహ్మదాబాద్ టీమ్‌కు ఆడింది. అయితే ఈసారి ఆ జట్టు లేకపోవడంతో వేలంలో పాల్గొనాల్సి వచ్చింది. ఇటీవల కాలంలో అద్భుత ప్రదర్శన కనబరుస్తున్న 19 ఏళ్ల డబుల్స్ స్టార్ సాత్విక్ సాయిరాజ్‌ను అదృష్టం వరించింది.
రూ. 25 లక్షల కనీస ధర కలిగిన సాత్విక్‌ను రూ.62 లక్షలకు చెన్నై సూపర్‌స్టార్స్ సొంతం చేసుకుంది. వరల్డ్ చాంపియన్‌షిప్ కాంస్య పతక విజేత భమిడిపాటి సాయిప్రణీత్‌ను రూ. 32 లక్షలకు బెంగళూరు అట్టి పెట్టుకుంది. ఫామ్‌లో లేని పారుపల్లి కశ్య్‌పను రూ.43 లక్షలకు ముంబై రాకెట్స్ తీసుకుంది.
18 ఏళ్ల లక్ష్యసేన్ కోసం అవధెతో పోటీపడిన చెన్నై రూ.36 లక్షలకు సొంతం చేసుకుంది. రూ.10 లక్షల కనీస ధర కలిగిన సౌరభ్ వర్మ రూ.41 లక్షలకు హైదరాబాద్ దక్కించుకుంది. డబుల్స్ ఆటగాడు సుమీత్ రెడ్డి (చెన్నై, రూ.11 లక్షలు), చిరాగ్ శెట్టి (పుణె, రూ.15.50 లక్షలు)లను పాత జట్లే అట్టిపెట్టుకున్నాయి.

9వ ర్యాంకర్ బీవాన్ జాంగ్‌ను రూ.39 లక్షలకు అవధె వారియర్స్ రిటైన్ చేసుకుంది. మరోవైపు తొలిసారిగా వేలంలో పాల్గొన్న జాతీయ కోచ్ పుల్లెల గోపీచంద్ కుమార్తె గాయత్రిని రూ.3 లక్షలకు చెన్నై సూపర్‌స్టార్స్ తీసుకుంది. అశ్వినీ పొన్నప్ప, సిరిల్ వర్మను ఎవరూ కొనుగోలు చేయలేదు. సైనా నెహ్వాల్, కిదాంబి శ్రీకాంత్ ఐదో సీజన్‌కు దూరమయ్యారు.
పీబీఎల్ ఐదో సీజన్ వచ్చే ఏడాది జనవరి 20 నుంచి ఫిబ్రవరి 9 వరకు జరుగుతుంది. మొత్తం 154 మంది షట్లర్లు వేలంలో పాల్గొనగా, ఇందులో 74 మంది భారత ఆటగాళ్లు. ఈ లీగ్‌లో మొత్తం ఏడు జట్లు పోటీపడుతున్నాయి. విజేతకు రూ.6 కోట్ల ప్రైజ్‌మనీ లభిస్తుంది. ప్రతీ జట్టులో 11 షట్లర్లు ఉంటారు. వీరిలో గరిష్ఠంగా ఆరుగురు విదేశీ ఆటగాళ్లకు అనుమతి ఉంది.

హైదరాబాద్ హంటర్స్
పురుషుల సింగిల్స్
Sourabh Verma (India) - Rs 41L
Daren Liew (Malaysia) - Rs 33L
Kiran George (India) - Rs 1L
మహిళల సింగిల్స్
PV Sindhu (India) - Rs 77L (Retained)
Ruthvika Shivani Gade (India) - Rs 1L
పురుషుల డబుల్స్
Vladimir Ivanov (Russia) - Rs 14L
Ben Lane (England) - Rs 6.75L
Sean Vendy (England) - Rs 5.75L
మహిళల మిక్స్‌డ్ డబుల్స్
Sikky N Reddy (India) - Rs 20L

ముంబై రాకెట్స్
పురుషుల సింగిల్స్
Parupalli Kashyap (India) - Rs 43L
Lee Dong Keun (Korea) - Rs 30L
Shreyansh Jaiswal (India) - Rs 1L
మహిళల సింగిల్స్
Shriyanshi Pardeshi (India) - Rs 1.5L
పురుషుల డబుల్స్
Kim Gi Jung (Korea) - Rs 45L (Retained)
Kim Sa Rang (Korea) - Rs 40L
Pranav Jerry Chopra (India) - Rs 6L
Shlok Ramachandran (India) - Rs 1L
మహిళల మిక్స్‌డ్ డబుల్స్
Pia Zebadiah (Indonesia) - Rs 17L
Jessica Pugh (England) - Rs 13L

అవధె వారియర్స్
పురుషుల సింగిల్స్:
Shubhankar Dey (India) - Rs 7L
Ajay Jayaram (India) - Rs 5L
Wong Wing Ki Vincent (Hong Kong) - Rs 20L
మహిళల సింగిల్స్:
Beiwen Zhang (USA) - Rs 39L (Retained)
Tanvi Lad (India) - Rs 1L
పురుషుల డబుల్స్:
Shin Baek Cheol (Korea) - Rs 45L
Ko Sung Hyun (Korea) - Rs 55L
Ivan Sozonov (Korea) - Rs 13L
మహిళల మిక్స్‌డ్ డబుల్స్:
Christinna Pedersen (Denmark) - Rs 15L

బంగళూరు రాప్టర్స్
పురుషుల సింగిల్స్
B Sai Praneeth (India) - Rs 32L (Retained)
Brice Leverdez (France) - Rs 21L
Ansal Yadav (India) - Rs 1L
మహిళల సింగిల్స్
Tai Tzu Ying (Chinese Taipei) - Rs 77L
Medha Shashidharan (India) - Rs 1L
పురుషుల డబుల్స్
Tak Ching Chang (Hong Kong) - Rs 12L
Chan Peng Soon (Malaysia) - Rs 30L
Arun George (India) - Rs 1L
మహిళల మిక్స్‌డ్ డబుల్స్
Eom Hye Won (Korea) - Rs 25L

చెన్నై సూపర్ స్టార్
పురుషుల సింగిల్స్
Tommy Sugiarto (Indonesia) - Rs 41L
S Sankar Muthusamy (India) - Rs 1L
Lakshya Sen (India) - Rs 36L
K Sathish Kumar (India) - Rs 1L
మహిళల సింగిల్స్
Gayatri Gopichand (India) - Rs 2L
Kristy Gilmour (Scotland) - Rs 10L
పురుషుల డబుల్స్
Sumeeth B Reddy (India) - Rs 11L (Retained)
Satwik Sairaj Rankireddy (India) - Rs 62L
Many Attri (India) - Rs 10L
మహిళల మిక్స్‌డ్ డబుల్స్
Sanjana Santosh (India) - Rs 2L
Gabrielle Adcock (England) - Rs 20L

నార్త్ ఈస్ట్రన్ వారియర్స్
పురుషుల సింగిల్స్
Saensomboonsuk Tanongsak (Thailand) - Rs 22L
Lee Cheuk Yiu (Hong Kong) - Rs 50L
Kaushal Dharmamer (India) - Rs 1L
మహిళల సింగిల్స్
Ashmita Chaliha (India) - Rs 3L
Michelle Li (Canada) - Rs 20L
పురుషుల డబుల్స్
Lee Yong Dae (Korea) - Rs 44L
Krishna Prasad Garaga (India) - Rs 1L
Bodin Isara (Thailand) - Rs 18L
మహిళల మిక్స్‌డ్ డబుల్స్
Kim Ha Na (Korea) - Rs 27L
Rutuparna Panda (India) - Rs 1L

పుణె 7 ఏసెస్
పురుషుల సింగిల్స్
Mithun Manjunath (India) - Rs 1L
Loh Kean Yew (Singapur) - Rs 36L
Kazumasa Sakai (Japan) - Rs 5L
మహిళల సింగిల్స్
Thi Trang Vu (Vietnam) - Rs 6L
Rituparna Das (India) - Rs 8L
పురుషుల డబుల్స్
Chirag Shetty (India) - Rs 15.5L (Retained)
Hendra Setiawan (Indonesia) - Rs 40L
Chris Adcock (England) - Rs 32L
MR Arjun (India) - Rs 2L
మహిళల మిక్స్‌డ్ డబుల్స్
Tse Ting Suet (Hong Kong) - Rs 30L
Kuhoo Garg (India) - Rs 1L
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications