For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సింధు మరో ఓటమి.. హైదరాబాద్‌కు బెంగుళూరు షాక్‌!!

PBL 5: Tai Tzu Ying beats PV Sindhu, Bengaluru Raptors thrash Hyderabad Hunters 3-0

హైదరాబాద్‌: సొంత గడ్డపై హైదరాబాద్‌ హంటర్స్‌ ప్లేయర్‌ పీవీ సింధు మరోసారి నిరాశ పరిచింది. మహిళల సింగిల్స్‌లో సింధు 15-11, 13-15, 9-15తో ప్రపంచ రెండో ర్యాంకర్‌ తై జు యింగ్‌ (బెంగళూరు రాప్టర్స్‌) చేతిలో ఓడింది. ప్రీమియర్‌ బ్యాడ్మింటన్‌ లీగ్‌ (పీబీఎల్‌) సీజన్‌-5లో భాగంగా గచ్చిబౌలి స్టేడియంలో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్‌ హంటర్స్‌ 0-3తో బెంగళూరు రాప్టర్స్‌ చేతిలో ఓడిపోయింది.

ఉత్కంఠభరితంగా సాగిన సింధు-తైజు మ్యాచ్‌లో సింధు 15-11తో తొలి సెట్‌ను కైవసం చేసుకుంది. ఆ తర్వాత రెండు సెట్లను 13-15, 9-15తో కోల్పోయి ఓడింది. తొలుత జరిగిన పురుషుల డబుల్స్‌లో బెన్‌ లేన్‌-వ్లాదిమిర్‌ ఇవనోవ్‌ (హైదరాబాద్‌) ద్వయం 13-15, 15-9, 12-15తో పెంగ్‌ సూన్‌ చాన్‌-రియాన్‌ అగుంగ్‌ సపుర్తో (బెంగళూరు) జోడీ చేతిలో ఓడింది. అనంతరం జరిగిన పురుషుల తొలి సింగిల్స్‌లో 'ట్రంప్‌ కార్డు'తో ఆడిన హైదరాబాద్‌ ప్లేయర్‌ సౌరభ్‌ వర్మ 12-15, 15-10, 6-15తో బ్రైస్‌ లెవెర్డెజ్‌ (బెంగళూరు) చేతిలో ఓటమిని ఎదుర్కొన్నాడు.

పీబీఎల్‌ నిబంధనల ప్రకారం 'ట్రంప్‌ కార్డు' వాడిన ఆటగాడు ఓడితే.. అతని జట్టుకు ఒక పాయింట్‌ను పెనాల్టీగా విధిస్తారు. దాంతో హైదరాబాద్‌ (-1)-2తో వెనుకబడింది. ఆ తర్వాత మహిళల సింగిల్స్‌లో కెప్టెన్‌ సింధు.. తై జూ యింగ్‌ చేతిలో ఓడడంతో హైదరాబాద్‌ కష్టాలు మరింత పెరిగాయి. డబుల్స్‌లో పీఎస్‌ చాన్‌-సపుత్ర 2-1తో హైదరాబాద్‌ జోడీ లేన్‌-ఇవనోవ్‌పై నెగ్గింది. హైదరాబాద్‌ ట్రంప్‌ మ్యాచ్‌లో సౌరభ్‌ వర్మ 1-2తో లెవర్‌డెజ్‌ చేతిలో ఓడాడు. మిక్స్‌డ్‌లో ఇవనోవ్‌-సిక్కి జోడీ 2-0తో చాన్‌-వాన్‌ ద్వయంపై నెగ్గినా ఫలితం లేకపోయింది.

బుధవారం జరిగిన మ్యాచ్‌లో హంటర్స్‌ 2-1 తేడాతో నార్త్‌ ఈస్టర్న్‌ వారియర్స్‌ను ఓడించింది. అయితే సొంత అభిమానుల మధ్య భారీ అంచనాలతో బరిలోకి సింధు ఓటమి షాక్‌కు గురి చేసింది. ఆద్యంతం తడబడి ఓటమితో నిరాశపర్చింది. అయితే తుది ఫలితం హంటర్స్‌కు అనుకూలంగా రావడం మాత్రం ఊరట. మహిళల సింగిల్స్‌ మ్యాచ్‌లో సింధు 8-15, 9-15 స్కోరుతో మిషెల్లీ లీ (నార్త్‌ ఈస్టర్స్‌ వారియర్స్‌) చేతిలో పరాజయంపాలైంది.

Story first published: Saturday, February 1, 2020, 9:33 [IST]
Other articles published on Feb 1, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+