Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆకట్టుకున్న సింధు, సిక్కి.. హైదరాబాద్‌ హంటర్స్‌ గెలుపు!!

PBL 2020: PV Sindhu Guides Hyderabad Hunters to 4-3 Win over Mumbai Rockets


హైదరాబాద్‌:
భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధుతో పాటు నిర్ణయాత్మక మ్యాచ్‌లో సిక్కి రెడ్డి జోడీ విజయం సాధించడంతో ప్రీమియర్‌ బ్యాడ్మింటన్‌ లీగ్‌ (పీబీఎల్‌)లో హైదరాబాద్‌ హంటర్స్‌ మరో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. పీబీఎల్‌ లీగ్‌లో భాగంగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్‌ హంటర్స్‌ 4-3తో ముంబై రాకెట్స్‌పై గెలిచింది. 3-3తో స్కోరు సమమైన స్థితిలో చివరగా జరిగిన మిక్స్‌డ్‌ డబుల్స్‌లో సిక్కి రెడ్డి-వ్లాదిమిర్‌ ఇవనోవ్‌ జోడీ 15-8, 15-8తో జబెదా బెర్నార్డ్‌-కిమ్‌ సరంగ్‌పై గెలిచింది.

తొలుత జరిగిన పురుషుల డబుల్స్, పురుషుల సింగిల్స్‌ మ్యాచ్‌ల్లో ఓడి 0-3తో వెనుకబడ్డ హైదరాబాద్‌కు సింధు తన విజయంతో ఊరట కలిగించింది. మహిళల సింగిల్స్‌లో సింధు 15-5, 15-10తో శ్రేయాన్షి (ముంబై)పై గెలిచింది. ఇందులో సింధు 'ట్రంప్‌ కార్డు'తో ఆడటంతో జట్టుకు రెండు పాయింట్లు
లభించాయి. అనంతరం పురుషుల రెండో సింగిల్స్‌లో ప్రియాన్షు (హైదరాబాద్‌) 15-13, 15-9తో లీ డాంగ్‌ కెయున్‌ (ముంబై)పై సంచలన విజయం సాధించడంతో.. ఇరు జట్ల స్కోర్లు 3-3తో సమం అయ్యాయి.

ఇక విజేతను నిర్ణయించే మిక్స్‌డ్‌ డబుల్స్‌లో ఇవనోవ్‌-సిక్కి రెడ్డి (హైదరాబాద్‌) ద్వయం 15-8, 15-8 కిమ్‌ సరంగ్‌-పియా జెబదియా (ముంబై) జోడీపై గెలుపొంది హైదరాబాద్‌ను విజేతగా నిలిపింది. సిక్కి రెడ్డికి 'ప్లేయర్‌ ఆఫ్‌ మ్యాచ్‌' అవార్డు లభించింది. మరోఐపు ముంబై ట్రంప్‌గా ఎంచుకున్న పురుషుల సింగిల్స్‌లో పారుపల్లి కశ్యప్తో పాటు డబుల్స్‌లో ఇవనోవ్‌ జోడీ గెలిచింది.

గచ్చిబౌలి స్టేడియంలో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్‌ హంటర్స్‌ 0-3తో బెంగళూరు రాప్టర్స్‌ చేతిలో ఓడిపోయిన విషయం తెలిసిందే. సింధు 15-11, 13-15, 9-15తో ప్రపంచ రెండో ర్యాంకర్‌ తై జు యింగ్‌ (బెంగళూరు రాప్టర్స్‌) చేతిలో ఓడింది. పురుషుల డబుల్స్‌, పురుషుల తొలి సింగిల్స్‌, ట్రంప్‌ మ్యాచ్‌లో హైదరాబాద్‌ ఓడడంతో 0-3తో బెంగళూరు చేతిలో ఓటమిని ఎదుర్కొంది.

Story first published: Monday, February 3, 2020, 8:52 [IST]
Other articles published on Feb 3, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+