సింధు గెలిచినా.. పీబీఎల్ నుంచి హైదరాబాద్ హంటర్స్ ఔట్!!

హైదరాబాద్: ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్) ఐదో సీజన్‌లో హైదరాబాద్ హంటర్స్ పోరాటం ముగిసింది. ఇదివరకే సెమీస్ రేసు నుంచి నిష్క్రమించిన హంటర్స్.. చివరి లీగ్ మ్యాచ్‌ను ఓటమితో ముగించి టోర్నీ నుంచి నిష్క్రమించింది. భారత స్టార్ షట్లర్ పీవీ సింధు విజయం సాధించినా హంటర్స్‌ను గట్టెంక్కించలేకపోయింది.
బుధవారం గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన 'టై'లో హంటర్స్ 1-2తేడాతో పుణె 7 ఏసెస్‌పై ఓడిపోయి సెమీస్ చేరకుండానే ఇంటిదారి పట్టింది. తొలుత జరిగిన పురుషుల డబుల్స్‌లో పుణె జోడీ గెలువగా.. ఆ తర్వాత ట్రంప్ మ్యాచ్‌గా ఎంపిక చేసుకున్న పురుషుల సింగిల్స్‌లో హైదరాబాద్ ఆటగాడు ప్రియాన్షు రావత్ పరాజయం పాలయ్యాడు. ఆ తర్వాత మహిళల సింగిల్స్‌లో ప్రపంచ చాంపియన్, హంటర్స్ స్టార్ పీవీ సింధు 15-7, 15-8 తేడాతో 7ఏసెస్ ప్లేయర్ రితుపర్ణ దాస్‌పై సునాయాస విజయం సాధించింది.
ఆ తర్వాత పుణె జోడీ ట్రంప్ మ్యాచ్‌గా ఎంపిక చేసుకున్న మిక్స్‌డ్ డబుల్స్‌లో ఎన్.సిక్కిరెడ్డి-వ్లాదిమర్ ఇవనోవ్ జోడీ విజయం సాధించడంతో హైదరాబాద్ స్కోర్లను 1-1తో సమం చేసింది. అయితే ఆ తర్వాత జరిగిన పురుషుల సింగిల్స్‌లో సౌరభ్ వర్మ ఓటమి పాలవడంతో.. హైదబాద్ హంటర్స్ 1-2తో ఓడిపోయింది. రెండు మినహా మిగతా మ్యాచ్‌లన్నీ కోల్పోవడంతో హంటర్స్‌కు నిరాశ తప్పలేదు. గురువారం జరిగే చివరి లీగ్ మ్యాచ్‌లో బెంగళూరు రాప్టర్స్, అవధ్ వారియర్స్ జట్లు తలపడనున్నాయి.
పీబీఎల్ ఐదో సీజన్‌లో పుణె 7 ఏసెస్ సెమీఫైనల్స్‌కు అర్హత సాధించించిన విషయం తెలిసిందే. ఇప్పటికే చెన్నై సూపర్ స్టార్స్, నార్త్ ఈస్ట్రన్ వారియర్స్ సెమీస్ చేరగా.. పుణె మూడో జట్టుగా నిలిచింది. సోమవారం జరిగిన మ్యాచ్‌లో పుణే 4-1తో అవధె వారియర్స్‌పై గెలుపొందింది. ఈ విజయంతో 18 పాయింట్లను ఖాతాలో వేసుకున్న పుణే 7 ఏసెస్ పాయింట్ల పట్టికలో నార్త్ ఈస్టర్న్ వారియర్స్‌తో సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచి నాకౌట్ దశకు అర్హత సాధించింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications