For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పీబీఎల్ 2018: సింధు విజయంతో.. సైనా ఓటమితో ముగించారు

PBL 2018: Hyderabad Hunters stay at the top as Delhi Dashers bow out with a win

హైదరాబాద్: ప్రీమియర్‌ బ్యాడ్మింటన్‌ లీగ్‌ నాలుగో సీజన్‌ లీగ్‌ దశ చివరి మ్యాచ్‌లను పీవీ సింధు విజయంతో, సైనా నెహ్వాల్ ఓటమితో ముగించారు. టోర్నీలో భాగంగా బుధవారం జరిగిన తొలి మ్యాచ్‌లో సింధు గెలిచినా.. హైదరాబాద్‌ హంటర్స్‌ 3-4తో ఢిల్లీ డాషర్స్‌ చేతిలో ఓటమి పాలుకాగా, విజయంతో టోర్నీ నుంచి ఢిల్లీ నిష్క్రమించింది.

పురుషుల సింగిల్స్‌ తొలి మ్యాచ్‌లో హంటర్స్‌ ఆటగాడు రాహుల్‌ 10-15, 15-9, 12-15తో ప్రణయ్‌ చేతిలో ఓడాడు. ఢిల్లీ ట్రంప్‌ మ్యాచ్‌గా ఎన్నుకొన్న పురుషుల డబుల్స్‌లోనూ హంటర్స్‌కు చుక్కెదురైంది. పురుషుల డబుల్స్‌లో చయ్‌ బియావో-జొంగ్జిత్‌ జోడీ 8-15, 15-9, 15-8తో అరుణ్‌-ఇసారా (హైదరాబాద్‌) జోడీపై విజయం సాధించింది.

సింధు విజయం

దీంతో ఢిల్లీ 3-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఆ తర్వాత మహిళల సింగిల్స్‌ను హంటర్స్‌ ‘ట్రంప్‌' మ్యాచ్‌గా ఎంచుకోగా సింధు 15-11, 15-9తో కొసెట్స్‌కయా (ఢిల్లీ)పై విజయం సాధించి ఆధిక్యాన్ని 2-3కు తగ్గించింది. ఆ తర్వాత రెండో పురుషుల సింగిల్స్‌లో సుగియార్తో (ఢిల్లీ) 15-6, 15-11తో గాల్జౌను ఓడించడంతో 4-2తో డాషర్స్‌ విజయం ఖాయమైంది.

25 పాయింట్లతో అవధె వారియర్స్

చివరగా మిక్స్‌డ్‌ డబుల్స్‌లో కిమ్‌ స రంగ్‌-ఇయోమ్‌ (హైదరాబాద్‌) జంట 15-7, 15-12తో వాంగ్‌ సిజి- చియా సిన్‌ లీ జోడీపై గెలిచింది. అనంతరం జరిగిన రెండో మ్యాచ్‌లో అవధె వారియర్స్‌ 5-0తో నార్త్‌ ఈస్టర్న్‌ వారియర్స్‌పై విజయం సాధించింది. దీంతో 25 పాయింట్లతో అవధె వారియర్స్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది.

బీవెన్‌ జాంగ్‌ చేతిలో సైనా ఓటమి

అవధె ట్రంప్‌గా ఎంచుకున్న మ్యాచ్‌లో నార్త్‌ ఈస్టర్న్ వారియర్స్ జట్టు కెప్టెన్‌ సైనా నెహ్వాల్‌ 15-11, 11-15, 7-15తో బీవెన్‌ జాంగ్‌ చేతిలో ఓడింది. టోర్నీలో మొత్తంగా 11 పాయింట్లే సాధించిన నార్త్‌ ఈస్టర్న్‌ ఇంటి ముఖం పట్టింది. తొలి మ్యాచ్‌గా జరిగిన పురుషుల సింగిల్స్‌లో లి డాంగ్‌ కియున్‌ 15-10, 15-13తో టియాన్‌ హోవీపై గెలిచి అవధెకు పాయింట్‌ అందించాడు.

ట్రంప్ మ్యాచ్‌లో సైతం

ఆ తర్వాత ట్రంప్‌గా ఎంచుకున్న మిక్స్‌డ్‌ డబుల్స్‌లో అశ్విని పొన్నప్ప-క్రిస్టిన్‌సెన్‌ జోడీ 15-7, 15-14తో లియో మిన్‌ చున్‌-కిమ్‌ హ నపై నెగ్గి 3-0 ఆధిక్యాన్ని సాధించింది. పురుషుల రెండో సింగిల్స్‌లో నార్త్‌ ఈస్టర్న్‌ ప్లేయర్‌ తియాంగస్ క సయూన్‌సోమ్‌బుక్‌ 15-8, 15-10తో సన్‌ వాన్‌ హోపై నెగ్గాడు. చివరి మ్యాచ్‌లో యాంగ్‌ లి-అర్జున్‌ జోడీ 15-5, 15-12తో ధ్రువ్‌ కపిల్‌-యు యాన్‌ సియాన్‌పై నెగ్గింది.

పీబీఎల్‌లో గురువారం

బెంగళూరు రాప్టర్స్‌ Vs చెన్నై స్మాషర్స్‌ (రాత్రి 7 నుంచి)

Story first published: Thursday, January 10, 2019, 10:58 [IST]
Other articles published on Jan 10, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+