For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పీబీఎల్‌ 4వ సీజన్ ఛాంపియన్ బెంగళూరు: ఫైనల్లో ముంబైపై గెలుపు

PBL 2018: Dominant Bengaluru Raptors beat spirited Mumbai Rockets to lift maiden title

హైదరాబాద్: ప్రీమియర్‌ బ్యాడ్మింటన్‌ లీగ్‌ (పీబీఎల్‌) నాలుగో సీజన్‌లో బెంగళూరు రాప్టర్స్‌ చాంపియన్‌గా నిలిచింది. ఆదివారం హోరాహోరీగా జరిగిన ఫైనల్లో బెంగళూరు 4-3 స్కోరుతో ముంబై రాకెట్స్‌ను ఓడించింది. బెంగళూరు రాఫ్టర్స్ జట్టు కెప్టెన్ కిదాంబి శ్రీకాంత్ పురుషుల సింగిల్స్‌లో 15-7,15-10 స్కోరుతో రాకెట్స్ ఐకాన్ షట్లర్ ఆంటోన్‌సెన్‌పై గెలిచి జట్టు చాంపియన్‌షిప్ సాధించడంలో కీలకపాత్ర పోషించాడు.

మొదట జరిగిన మిక్స్‌డ్‌ డబుల్స్‌ను 'ట్రంప్‌'గా ఎంచుకున్న ముంబై రాకెట్స్‌ ఇందులో గెలిచి శుభారంభం చేసింది. కిమ్‌ జీ జాంగ్‌-బెర్నడెత్‌ (ముంబై) జంట 15-8, 15-14తో మార్కస్‌ ఎలిస్‌-లారెన్‌ స్మిత్‌ (బెంగళూరు) జోడీపై నెగ్గింది. ఆ తర్వాత పురుషుల సింగిల్స్‌లో తెలుగు తేజం కిడాంబి శ్రీకాంత్‌ (బెంగళూరు) 15-7, 15-10తో అంటోన్సెన్‌ (ముంబై)పై నెగ్గి 1-2తో రాకెట్స్‌ ఆధిక్యాన్ని తగ్గించాడు.

ఇక, బెంగళూరు 'ట్రంప్‌' మ్యాచ్‌గా ఎంచుకున్న మహిళల సింగిల్స్‌లో తి ట్రంగ్‌ వు 15-8, 15-9తో శ్రియాన్షి పరదేశి (ముంబై)ని చిత్తుచేసింది. ఫలితంగా బెంగళూరు 3-2తో ముందంజ వేసింది. అయితే రెండో పురుషుల సింగిల్స్‌లో తెలుగు షట్లర్‌ భమిడిపాటి సాయిప్రణీత్‌ (బెంగళూరు) 15-7, 12-15, 3-15తో సమీర్‌ వర్మ (ముంబై) చేతిలో ఓడాడు.

దీంతో ఇరు జట్లు 3-3తో సమానంగా నిలిచాయి. కీలకమైన ఐదో, ఆఖరి మ్యాచ్‌ పురుషుల డబుల్స్‌లో బెంగళూరు జోడీ అహ్‌సాన్‌-సెతియవాన్‌ 15-13, 15-10 స్కోరుతో ముంబై జోడీ జంగ్‌-లీయాంగ్‌పై నెగ్గడంతో బెంగళూరు రాప్టర్స్‌ నాలుగో సీజన్‌ విజేతగా అవతరించింది. విజేతగా నిలిచిన బెంగళూరు రాప్టర్స్‌కు రూ. 3 కోట్ల ప్రైజ్‌మనీ లభించింది.

Story first published: Monday, January 14, 2019, 9:20 [IST]
Other articles published on Jan 14, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+